ముంబై : కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కీలక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు విండీస్ ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. సెమీ ఫైనల్ కు చేరుకుంది. ఈనెల 5న ముంబై వాంఖడే స్టేడియం వేదికగా సెమీ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్ తో ఆడనుంది. ఈ సందర్భంగా కోల్ కతా నుండి భారత జట్టు ముంబైకి చేరుకుంది ఆడేందుకు . మీడియాతో మాట్లాడాడు భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. అందరూ సంజూ శాంసన్ గురించి మాట్లాడుతున్నారని కానీ శివమ్ దూబే ఆడిన షాట్స్ కూడా అత్యంత ముఖ్యమైనవని పేర్కొన్నాడు. తను ఆ సమయంలో రెండు ఫోర్లు కొట్టక పోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నాడు.
క్రికెట్ అంటేనే ఒకరితో ముడిపడి ఉన్న గేమ్ కాదన్నాడు. ఇదే సమయంలో ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంటుందని చెప్పాడు. ఆ విషయం తెలుసుకోకుండా ఒకరినే పైకి ఎత్తడం ఇంకొకరిని తక్కువ చేసి చూడడం మంచి పద్దతి కాదన్నాడు. ఆ సమయంలో శివమ్ దూబే రెండు క్లాసిక్ ఫోర్లు కొట్లాడాడని, దీంతో ఒత్తిడి తగ్గిందన్నాడు. క్రికెట్ అనేది జట్టు ఆట, చాలా సంవత్సరాలుగా, మేము కొన్ని సహకారాల గురించి మాత్రమే మాట్లాడామన్నాడు . నా వరకు చూస్తే శివమ్ ఆడిన ఆ రెండు ఫోర్లు కూడా సంజూ శాంసన్ చేసిన 97 పరుగులతో పాటే ముఖ్యమైనవని పేర్కొన్నాడు గంభీర్.
