Sheikh Hasina : బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు (Sheikh Hasina) కోలుకోలేని షాక్ తగిలింది. దేశ అత్యున్నత కోర్టు ఇప్పటికే తమ ఆదేశాలు పాటించక పోవడాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈమేరకు సంచలన తీర్పు వెలువరించింది. తనకు మరణ శిక్ష విధించింది. ఇదిలా ఉండగా షేక్ హసీనా ప్రస్తుతం భారత దేశంలో ఆశ్రయం తీసుకుంటోంది. ఆమెను అరెస్ట్ చేయాలంటే అంతర్జాతీయ కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా మరణ శిక్షతో పరేషాన్ లో ఉన్న షేక్ హసీనాతో పాటు తన కుటుంబానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. తాజాగా బంగ్లాదేశ్ కోర్టు 3 అవినీతి కేసుల్లో ప్రధాని హసీనాకు 21 సంవత్సరాల జైలు శిక్ష విధించింది . దేశ రాజధాని ఢాకాకు ఆనుకుని ఉన్న పుర్బాచల్‌లోని ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై 78 ఏళ్ల హసీనా, ఆమె కుమారుడు సాజిబ్ వాజెద్ జాయ్ , కుమార్తె సైమా వాజెద్ పుతుల్‌లకు మూడు కేసుల్లో శిక్షలు విధించింది.
Sheikh Hasina Shokcing Cases
హసీనా కుటుంబంతో పాటు, గృహ నిర్మాణ శాఖ మాజీ జూనియర్ మంత్రి షరీఫ్ అహ్మద్ , గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ కు చెందిన ఉన్నతాధికారులను ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టింది కోర్టు. ఈ కేసుకు సంబంధించి ఒకరు తప్పా అందరికీ వేర్వేరు జైలు శిక్షలు విధించింది ధర్మాసనం. ఇదిలా ఉండగా ఈ కీలక తీర్పులో మాజీ ప్రధాని షేక్ హసీనాకు 21 ఏళ్లు జైలు శిక్ష విధిస్తే, కొడుకు, కూతురుకు ఐదేళ్ల పాటు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది కోర్టు. ఈ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తి మొహమ్మద్ అబ్దుల్లా అల్ మామూన్ . షేక్ హసీనాకు ఎటువంటి దరఖాస్తు లేకుండా , చట్టబద్ధంగా అధికారం పొందిన అధికార పరిధిని మించిన విధంగా ప్లాట్‌ను కేటాయించారని ఆరోపించారు.
Also Read : TG High Court Shocking : గ్రూప్-2 రిక్రూట్‌మెంట్ రద్దుపై హైకోర్టు స్టే















