తిరువనంతపురం: కేరళలో రాజకీయాలు మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. ఇప్పటికే జరిగిన శాసన సభ ఎన్నికల్లో యుడీఎఫ్ భారీ విజయాన్ని నమోదు చేసింది. అయితే కూటమిలోని పార్టీల మధ్య ఇంకా సీఎం ఎవరనే దానిపై ఇంకా చర్చలు కొలిక్కి రాలేదు. ఈ సందర్బంగా శుక్రవారం తిరువనంతపురం కాంగ్రెస ఎంపీ , సీనియర్ నాయకుడు శశి థరూర్ మర్యాద పూర్వకంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు. కేరళలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. రాష్ట్రంలోని సీనియర్ నాయకులతో సంప్రదింపుల అనంతరం ముఖ్యమంత్రి అభ్యర్థిపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుంది.
తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకునే అధికారాన్ని పార్టీ హైకమాండ్‌కు ఇస్తూ కేరళలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీర్మానం ఆమోదించిన ఒక రోజు తర్వాత, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమై కేరళలోని పరిస్థితిపై తన అనుభవాన్ని పంచుకున్నారు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ సభ్యులు తిరువనంతపురంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన చిత్రాలను కాంగ్రెస్ ఎంపీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ,దృఢమైన, సూటిగా మాట్లాడే , అనుభవజ్ఞుడైన సీనియర్ నాయకుడితో అభిప్రాయాలను పంచుకోవడం ఎల్లప్పుడూ మంచిది అని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని సీనియర్ నాయకులతో సంప్రదించిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిపై పార్టీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ నాయకుడు కె. మురళీధరన్ అన్నారు. కేరళం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం అనంతరం మాట్లాడారు.
