శశి థరూర్ డీప్‌ఫేక్ వీడియోను తొలగించాలి

సీరియ‌స్ అయిన హైకోర్టు ఆదేశాలు జారీ

hellotelugu-DelhiHighCourt

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి చెందిన‌ ఎంపీ శ‌శి థ‌రూర్ కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోను త‌క్ష‌ణ‌మే తొల‌గించాల‌ని హైకోర్టు ఆదేశించింది. థరూర్ పేరు, చిత్రం, విలక్షణమైన స్వరం, ఆయన ప్రత్యేకమైన ప్రసంగ శైలి, మాట్లాడే తీరు, ఉన్నతమైన పదజాలం వంటి వాటిని దుర్వినియోగం చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు నిరోధించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా అందుబాటులో లేకుండా చేసిన కొన్ని అభ్యంతరకరమైన రీల్స్ అలాగే కొనసాగేలా చూడాలని కూడా కోర్టు మెటాను కోరింది. త‌న‌ వ్యక్తిత్వ హక్కులను ఢిల్లీ హైకోర్టు పరిరక్షించింది. పాకిస్థాన్ దౌత్యనీతిని ఆయన ప్రశంసిస్తున్నట్లుగా చూపిస్తున్న ఏఐ రూపొందించిన డీప్‌ఫేక్ వీడియోను తొలగించాలని ‘ఎక్స్స‌ సంస్థను ఆదేశించింది. థరూర్ దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ మినీ పుష్కర్ణ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

వాయిస్-క్లోన్ చేసిన ఆడియో, మార్ఫింగ్ చేసిన వీడియోలు మొదలైన వాటిని ఏ వాణిజ్య, రాజకీయ లేదా దురుద్దేశ పూర్వక ప్రయోజనం కోసం ఏ భౌతిక లేదా వర్చువల్ మాధ్యమంలోనైనా ఉపయోగించడం చ‌ట్ట‌రీత్యా నేర‌మ‌ని పేర్కొంది ధ‌ర్మాస‌నం. ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా అందుబాటులో లేకుండా చేసిన కొన్ని అభ్యంతరకరమైన రీల్స్ అలాగే కొనసాగేలా చూడాలని కూడా కోర్టు మెటాకు సూచించింది.. రాజకీయంగా సున్నితమైన‌ ప్రకటనలు చేస్తున్నట్లుగా చిత్రీకరిస్తూ, పదేపదే ప్రచురిస్తున్న డీప్‌ఫేక్ వీడియోలకు వ్యతిరేకంగా థరూర్ గతంలో కోర్టును ఆశ్రయించారు. అటువంటి కంటెంట్ ఆయన ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా భారతదేశ అంతర్జాతీయ స్థాయిని కూడా ప్రభావితం చేసిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Exit mobile version