Tilak Varma : హైదరాబాద్ : దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025 మెగా టోర్నీ ముగిసింది. భారత జట్టు మరోసారి మెరిసింది. ఛాంపియన్ గా నిలిచింది. తన చిరకాల ప్రత్యర్థి దాయాది పాకిస్తాన్ జట్టుకు షాక్ ఇచ్చింది. ఫైనల్ లో 5 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. ఈ టోర్నీలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. శ్రీలంక జట్టు తరపున ఆడిన నిస్సాంక దుమ్ము రేపాడు. ఇండియా బౌలర్లను చితక్కొట్టాడు అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు.
చివరగా 11 రన్స్ తేడాతో భారత్ చేతిలో ఓటమి పాలైనా తను తళుక్కున మెరిశాడు. ఇండియా జట్టులో అభిశేక్ శర్మ, తిలక్ వర్మలు (Tilak Varma) అద్భుతంగా రాణించారు. ఇక బౌలర్ల పరంగా కుల్దీప్ యాదవ్ సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. తనతో పాటు అర్ష్ దీప్ కూడా. 100 వికెట్లు పూర్తి చేసిన తొలి భారతీయ క్రికెటర్ గా నిలిచాడు.
Asia Cup 2025 Tilak Varma, Abhishek Sharma Viral
ఇక ఫైనల్ మ్యాచ్ లో ముందుగా పాకిస్తాన్ 146 రన్స్ చేసింది. ఇండియా 147 రన్స్ చేసింది 5 వికెట్లు కోల్పోయి. తిలక్ వర్మ 69 రన్స్ చేయగా, శాంసన్ 24, దూబే 33 పరుగులు చేశారు. ఇక తొమ్మిదోసారి భారత జట్టు కైవసం చేసుకుంది. ఇక టోర్నీలో టీమ్ ఇండియా ఆడిన మొత్తం ఏడు మ్యాచ్ లలో ఏ ఒక్కటి ఓడి పోకుండా జైత్రయాత్ర కొనసాగింది. అభిషేక్ శర్మ అన్ని మ్యాచ్ లు కలిపి 314 రన్స్ చేశారు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. తను అత్యధికంగా 75 రన్స్ చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 44.85 గా ఉంది. జట్టు స్కిప్పర్ సూర్య కుమార్ యాదవ్ 7 మ్యాచ్ లలో 72 పరుగులు మాత్రమే చేశాడు. తన అత్యధిక స్కోర్ 47 మాత్రమే. ఇక శుభమన్ గిల్ 7 మ్యాచ్ లలో 127 రన్స్ చేశాడు. ఇందులో 47 అత్యధిక స్కోర్. తిలక్ వర్మ 7 మ్యాచ్ లలో 213 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోర్ 69 రన్స్ ఉన్నాయి. పాకిస్తాన్ తరపున పర్హాన్ 217 రన్స్ చేశాడు.
Also Read : Telangana Police Strong Focus : సినిమా పైరసీ రాకెట్ పై ఖాకీల ఉక్కుపాదం



















