Sharad Pawar Shocking Comments : 160 అసెంబ్లీ సీట్ల ఫిక్స్ చేసేందుకు ఆఫ‌ర్

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన శ‌ర‌ద్ ప‌వార్

Hello Telugu - Sharad Pawar Shocking Comments

Hello Telugu - Sharad Pawar Shocking Comments

Sharad Pawar : నాగ‌పూర్ – ఎన్సీపీ (ఎస్పీ) అధ్య‌క్షుడు శ‌ర‌ద్ ప‌వార్ (Sharad Pawar) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్బంగా 160 అసెంబ్లీ సీట్లను ‘ఫిక్స్’ చేయడానికి ఆఫర్ ఇచ్చారని పవార్ ఆరోపించారు. ఫడ్నవీస్ ఈ వాదనను తోసిపుచ్చారు. రాష్ట్రంలోని 288 సీట్లలో 160 సీట్లలో విజయం సాధిస్తామని గ్యారంటీతో ఇద్దరు వ్యక్తులు తనను సంప్రదించారని శ‌నివారం పేర్కొన్నారు. ఆ స‌మ‌యంలో తాను ఆశ్చ‌ర్య పోయాన‌ని అన్నాడు. తాను ఆ ఇద్దరినీ పట్టించు కోలేదన్నారు. ఆ సమయంలో, నాకు ఎన్నికల కమిషన్ గురించి ఎటువంటి అనుమానం క‌ల‌గ లేద‌న్నారు. నేను రాహుల్ గాంధీతో వారి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఆ తర్వాత, ఆ వ్యక్తులు ఏమి చెప్పాలని అనుకున్నారో వారు త‌న‌కు చెప్పార‌ని తెలిపారు ప‌వార్.

Sharad Pawar Shocking Comments

కాగా రాహుల్ , తాను వారిపై దృష్టి సారించ కూడ‌ద‌ని అనుకున్నామ‌న్నారు. ఇది మా మార్గం కాద‌ని త‌మ‌కు తెలుస‌న్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో తాము ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి వారి ఆశీర్వాదాన్ని కోరుకోవాలని మాత్ర‌మే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు శ‌ర‌ద్ ప‌వార్. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర పార్టీ చీఫ్ శశికాంత్ షిండే, మాజీ హోం మంత్రులు అనిల్ దేశ్‌ముఖ్, జితేంద్ర అవ్హాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రోహిత్ పవార్, ఇతరుల సమక్షంలో ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో పవార్ ఈ విషయాలను వెల్లడించారు. ఎన్నికల్లో ఓట్ల దొంగతనం, రిగ్గింగ్ వంటి వివిధ అంశాలను లేవనెత్తాలన్న రాహుల్ గాంధీ చర్యకు పవార్ మద్దతు ఇచ్చారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

Also Read : PM Modi New Innovation : రేపే భార‌త్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రారంభం

Exit mobile version