P&G CEO Shailesh Jejurikar Inspiring : ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ కంపెనీ సీఈఓగా శైలేష్ జెజురిక‌ర్

వ‌చ్చే 2026లో కొలువు తీర‌నున్న ప్ర‌వాస భార‌తీయుడు

Hello Telugu - P&G CEO Shailesh Jejurikar Inspiring

Hello Telugu - P&G CEO Shailesh Jejurikar Inspiring

Shailesh Jejurikar : ఢిల్లీ – ఎవ‌రీ శైలేష్ జెజురిక‌ర్ అనుకుంటున్నారా. ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందిన ప్రోక్ట‌ర్ అండ్ గ్యాంబుల్ కంపెనీకి ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి (సీఈవో ) గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు. ఇప్ప‌టికే ప్ర‌వాస భారతీయులు ప‌లు దిగ్గ‌జ కంపెనీల‌ను న‌డుపుతున్నారు. వారిలో గూగుల్ సిఇఓ సుంద‌ర్ పిచాయ్ కాగా మ‌రొక‌రు ఏపీకి చెందిన మైక్రోసాఫ్ట్ సీఈఓ స‌త్య నాదెళ్ల‌. విచిత్రం ఏమిటంటే శైలేష్ జెజురిక‌ర్ (Shailesh Jejurikar) , స‌త్య నాదెళ్ల ఇద్ద‌రూ క్లాస్ మేట్స్. ప్రోక్ట‌ర్ అండ్ గ్యాంబ‌ల్ కు 200 ఏళ్ల చ‌రిత్ర ఉంది. రూ. 7 ల‌క్ష‌ల కోట్ల విలువైన కంపెనీ ఇది. ప్ర‌స్తుతం ఈ కంపెనీకి సీఈవోగా జాన్ మోల్ల‌ర్ ఉన్నారు. ఆయ‌న నుంచి వ‌చ్చే ఏడాది 2026 జ‌న‌వ‌రి 1న సీఈఓగా జెజురిక‌ర్ బాధ్య‌త‌లు చేప‌డతారు.

Shailesh Jejurikar As a P&G CEO

ఇండియాకు చెందిన వారిలో మ‌రికొంద‌రు కూడా ఉన్నారు ఉన్న‌త స్థానాల‌లో. వారిలో అర‌వింద్ కృష్ణ త‌ను ఐబీఎంలో ఉన్నాడు. షంత‌ను నారాయ‌ణ్ అడోబ్ కు సిఇఓగా ఉండ‌గా షానెల్ కంపెనీకి లీనా నాయ‌ర్ చీఫ్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. త‌ను ఐఐఎం ల‌క్నోలో చ‌దివాడు జుజెక‌ర్. అంత‌కు ముందు హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ లో చ‌ద‌వ‌డం విశేషం. అండర్-17 క్రికెట్ టోర్నమెంట్లలో పాల్గొన్నారు . త‌ను ముంబైలో జన్మించారు . త‌ను ప్రస్తుతం అమెరికాలోని సిన్సినాటిలో తన భార్య సంఖ్యా (విజువల్ ఆర్టిస్ట్) , ఇద్దరు కుమారులతో నివసిస్తున్నారు. అంతే కాదు త‌న‌ సోదరుడు రాజేష్ జెజురికర్ కూడా ప్ర‌ముఖ ప‌ద‌విలో ఉన్నారు. త‌ను మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ , సీఈఓగా ఉన్నారు.

Also Read : AKSI Aerospace Growth : 44 కోట్లతో హైదరాబాద్ లో ‘ఏకేఎస్ఐ’ డ్రోన్ల సంస్థ విస్తరణ

Exit mobile version