ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌లువురు ఐఏఎస్ లు బ‌దిలీ

ఉత్త‌ర్వులు జారీ చేసిన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

hellotelugu-APGvt

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పాల‌నా ప‌రంగా మ‌రింత ప‌ట్టు పెంచుకునేందుకు గాను కీల‌క‌మైన ఉన్న‌తాధికారుల‌ను, ఐఏఎస్ ల‌ను బ‌దిలీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులకు షాక్ ఇచ్చింది. వారిపై ట్రాన్స్ ఫ‌ర్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో కీల‌క‌మైన పోస్టులో ఉన్న సీఆర్డీఏ క‌మిషన‌ర్ క‌న్న‌బాబును బ‌దిలీ చేసింది. ఇదిలా ఉండ‌గా త‌నను ఏపీ రాష్ట్ర‌ పౌర సరఫరాల కమిషనర్ గా నియ‌మించింది.

మ‌రో వైపు కీల‌కమైన పోస్టులో ఉన్న క‌న్న‌బాబును త‌ప్పించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న స్థానంలో సీఆర్డీఏ కమిషనర్ గా విజయ రామరాజుకు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. పౌర సరఫరాలశాఖ కమిషనర్ గా ఉన్న సౌరభ్ గౌర్ ను రిలీవ్ చేసింది. జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను కూడా మార్చేసింది. మార్కాపురం జిల్లా కలెక్టర్ గా విజయ సునీతను నియ‌మించ‌గా , పోలవరం జిల్లా కలెక్టర్ గా దినేష్ కుమార్ తో పాటు రవి సుభాష్ కు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ పూర్తి అదనపు బాధ్యతలు అప్ప‌గిస్తూ సీఎస్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Exit mobile version