Hero Rajinikanth Coolie Movie : కోలీవుడ్ ను షేక్ చేస్తున్న ర‌జనీ కూలీ మేనియా

రిలీజ్ కాకుండానే రికార్డుల మోత మోగిస్తున్న మూవీ

hellotelugu-rajinikanthcoolie

Coolie : ఎవ‌రైనా 70 ఏళ్లు వ‌స్తే ఏం చేస్తారు..హాయిగా ప్ర‌శాంత జీవితం గ‌డ‌పాల‌ని కోరుకుంటారు. కానీ త‌మిళ సినీ రంగంలో నేటికీ రారాజుగా వెలుగొందుతున్న త‌లైవా ర‌జ‌నీకాంత్ మాత్రం ఇంకా సినిమాల‌లో నటిస్తూ త‌న‌కు ఎదురే లేద‌ని చాటుతున్నారు. మొన్న‌టికి మొన్న త‌ను న‌టించిన జైల‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ కు కోట్లు తెప్పించింది. తాజాగా ఇదే సంస్థ మ‌రో మూవీతో ముందుకు వ‌చ్చింది. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించింది . అదే కూలీ (Coolie). దీనికి లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌కుడు. ఇంకా రిలీజ్ కాకుండానే భారీ డిమాండ్ ఉంటోంది. ర‌జ‌నీకాంత్ సినీ కెరీర్ లోనే ఈ సినిమా ఓవ‌ర్సీస్ రైట్స్ రూ. 80 కోట్ల‌కు అమ్ముడు పోవ‌డం సినీ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది.

Coolie Movie Updates

తాజాగా మ‌రో కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఆగ‌స్టు 14న రానున్న ఈ సినిమాను ప‌లు భాష‌ల‌లో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మూవీ మేక‌ర్స్. అయితే దీనిపై పెట్టిన ఖ‌ర్చంతా ముందే వ‌చ్చేసింద‌న్న టాక్ కూడా వినిపిస్తోంది. మ‌రో వైపు అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే కూలీ మూవీలో స్పెష‌ల్ సాంగ్ లో త‌ళుక్కున మెరిసింది. మోనికా ఐ ల‌వ్ అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌ల‌యాళ న‌టుడు ఈ పాట‌లో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారాడు. ఈ సాంగ్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. కూలీకి రాక్ స్టార్ అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు. జైల‌ర్ కంటే భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి కూలీ చిత్రంపై.

Also Read : Beauty Fatima Sana Shaikh : మాధ‌వ‌న్ తో న‌టించ‌డం అద్భుతం : స‌నా షేక్

Exit mobile version