Seediri Appalaraju : శ్రీకాకుళం జిల్లా – మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ గురించి మా ఇంట్లో కుక్కలు కూడా మాట్లాడుకోవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నువ్వు ఎమ్మెల్యే కాబట్టి ప్రజలు మాట్లాడుతున్నారని, అసలు తనకు నీకు పోలిక ఏంటి అంటూ మండిపడ్డారు. గౌతు శిరీష నోరు పారేసుకుంటోందని, ఇంకోసారి ఇలాగే వాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వాగితే బాగుండదన్నారు. తాను ఆమె గురించి ఎక్కడా ప్రస్తావించ లేదన్నారు. కూటమి సర్కార్ కొలువు తీరాక ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు సీదిరి అప్పలరాజు.
Seediri Appalaraju Slams MLA Gouthu Sireesha
ఇది మంచి పద్దతి కాదన్నారు మాజీ మంత్రి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం నిద్ర పోతోందని, సీఎం చంద్రబాబు నాయుడు కేవలం తన వ్యక్తిగత ప్రచారానికి మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీల పేరుతో జనాన్ని మోసం చేశారని, ఇప్పటి వరకు ఎంత మందికి లబ్ది చేకూరిందో చెప్పాలన్నారు సీదిరి అప్పలరాజు. సీఎంగా కొలువు తీరాక ఢిల్లీకి, పెట్టుబడుల పేరుతో విదేశాలలో పర్యటించడం తప్పితే చేసింది ఏముందంటూ ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఇకనైనా మేలుకుంటే మంచిదని హితవు పలికారు. ఇక ఎమ్మెల్యే గౌతు శిరీషకు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Also Read : CM Chandrababu Proven : ఆప్కాబ్ కు సాంకేతిక జోడించాలి – సీఎం

















