జ‌ర్న‌లిస్ట్ కేవీఆర్ పై రాజ‌ద్రోహం కేసు

అడ్డుకున్న జ‌ర్న‌లిస్టులు, ప్ర‌జా సంఘాలు

hellotelugu-JournalisstKVR

హైద‌రాబాద్ : ఏపీ పోలీసులు తెలంగాణలోని ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కె. వెంక‌ట్రాం రెడ్డి అలియాస్ కేవీఆర్ పై రాజ‌ద్రోహం కేసు పెట్ట‌డం సంచ‌ల‌నంగా మారింది. తను ఏపీ స‌ర్కార్ ను, సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్ ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ త‌రుణంలో త‌న‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీకి చెందిన పోలీసులు హైద‌రాబాద్ కు వ‌చ్చారు. విష‌యం తెలుసుకున్న వెంట‌నే తెలంగాణ‌కు చెందిన జ‌ర్న‌లిస్టులు, ప్ర‌జా సంఘాల నాయ‌కులు పెద్ద ఎత్తున కేవీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఏపీ పోలీసులతో పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగారు.

ఈ సంద‌ర్బంగా తెలంగాణ క్రాంతి ద‌ళ్ అధ్య‌క్షుడు పృథ్వీ రాజ్ యాద‌వ్ నిప్పులు చెరిగారు తెలంగాణ స‌ర్కార్ పై. రేవంత్ రెడ్డి ఏమన్నా చంద్రబాబు అపాయింటెడ్ సీఎం ఆ.? అని ప్ర‌శ్నించారు.తెలంగాణలో ఎవరి ప్రభుత్వం నడుస్తుంది.?!! చంద్రబాబు రాజ్యమా.!? రేవంత్ రెడ్డి రాజ్యమా.?? అని నిప్పులు చెరిగారు. అరెస్ట్ చేస్తే అగ్నిగుండం అవుతుంద‌ని వార్నింగ్ ఇచ్చారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడం సరైన విధానం కాదని ఖండించారు జర్నలిస్టులు దాసరి శ్రీనివాస్ తొలివెలుగు రఘు, క్రాంతి దళ్ నేత పృథ్వీరాజ్. ఇలాగే కొన‌సాగితే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

Exit mobile version