SBI : దేశంలో అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆటో స్వీప్ (MOD) సేవ పరిమితిని ₹35,000 నుండి ₹50,000 కు పెంచింది. అంటే, ఇకపై సేవింగ్స్ అకౌంట్‌లో బ్యాలెన్స్ ₹50,000 దాటితే, అదనపు మొత్తం ఆటోమేటిక్‌గా స్థిర డిపాజిట్ (MOD) గా మారుతుంది. దీని ద్వారా కస్టమర్లకు పొదుపు ఖాతా వడ్డీ కంటే ఎక్కువ లాభం లభిస్తుంది.
SBI – MOD పథకం ప్రత్యేకత
MOD (మల్టీ ఆప్షన్ డిపాజిట్) ఒక ప్రత్యేక డిపాజిట్ విధానం. ఇందులో సేవింగ్స్ ఖాతాలో మిగిలిన అదనపు డబ్బును బ్యాంక్ ఆటోమేటిక్‌గా టర్మ్ డిపాజిట్‌కు బదిలీ చేస్తుంది. అవసరమైనప్పుడు ఆ డబ్బును రివర్స్ స్వీప్ ద్వారా తిరిగి ఖాతాలోకి తీసుకొస్తారు. ఈ సౌకర్యం వల్ల డబ్బు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి, అదనంగా వడ్డీ ఆదాయం కూడా వస్తుంది.
వడ్డీ & చెల్లింపు నిబంధనలు
- MODపై వడ్డీ రేటు సేవింగ్స్ ఖాతా కంటే ఎక్కువ.
- వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన చెల్లించబడుతుంది, చక్రవడ్డీ పద్ధతిలో లెక్కిస్తారు.
- డబ్బు ముందుగా ఉపసంహరించుకుంటే, ఆ కాలానికి వర్తించే వడ్డీ చెల్లించబడుతుంది.
- వడ్డీపై TDS (పన్ను మినహాయింపు) అమల్లో ఉంటుంది.
సీనియర్ సిటిజన్లకు ప్రయోజనాలు
SBI సీనియర్ సిటిజన్లకు MODపై అదనపు వడ్డీ అందిస్తుంది. అయితే 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్లకు ప్రత్యేక రాయితీ వర్తించదు.
రివర్స్ స్వీప్ విధానం
- రివర్స్ స్వీప్ ₹5,000 యూనిట్లలో జరుగుతుంది.
- టర్మ్ డిపాజిట్ బ్యాలెన్స్ ₹15,000 కంటే తక్కువగా ఉంటే, మొత్తం మొత్తం సేవింగ్స్ ఖాతాలోకి బదిలీ అవుతుంది.
- డిఫాల్ట్‌గా LIFO (లాస్ట్ ఇన్, ఫస్ట్ అవుట్) విధానం అమలులో ఉంటుంది.
- కస్టమర్ కోరుకుంటే, FIFO (ఫస్ట్ ఇన్, ఫస్ట్ అవుట్) ఎంపికను కూడా ఎంచుకోవచ్చు.
మెచ్యూరిటీ సమయంలో
MOD గడువు పూర్తయిన వెంటనే, ప్రధాన మొత్తం మరియు వడ్డీతో సహా మొత్తం డబ్బు సేవింగ్స్ ఖాతాలోకి ఆటోమేటిక్‌గా జమ అవుతుంది.
Also Read : Today Gold and Silver Price : స్వల్ప తగ్గుదల తో నడుస్తున్న బంగారం, వెండి ధరలు



















