చెన్నై : విశాల్ వెంకట్ దర్శకత్వంలో రెజీనా కసాండ్ర, నాజర్ , రమేష్ తిలక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ చెన్నైలో పూర్తయింది. ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్‌కు చెందిన ‘జి స్క్వాడ్స్ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను ప్రకటించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ‘మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థ తన ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని తెలిపింది. మా సంస్థ , ‘జి స్క్వాడ్’ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్ర షూటింగ్ పూర్తయింది. త్వరలోనే టైటిల్‌ను ప్రకటిస్తాం, వేచి ఉండండి! ఇందులో నాజర్, రెజీనా కసాండ్ర , రమేష్ తిలక్ నటిస్తున్నారు అని పేర్కొంది. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రం నిర్మాణ దశలో చివరి అంకానికి చేరుకుందని చిత్ర బృందం ఈ ఏడాది అక్టోబర్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే.
ఆ ప్రకటన సమయంలో సినిమా చిత్రీకరణకు సంబంధించిన తెర వెనుక దృశ్యాలతో కూడిన ఒక ప్రత్యేక వీడియోను కూడా వారు విడుదల చేశారు. ‘శిల నేరంగళిల్ శిల మనిదర్గళ్’ విమర్శకుల ప్రశంసలు పొందిన ‘బాంబ్’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన విశాల్ వెంకట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి హరిహరన్ రాజు కథ అందించగా ఎస్.కె. సెల్వకుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూరుస్తున్నారు. కళా దర్శకత్వ విభాగంలో కె. మనోజ్ కుమార్ వ్యవహరిస్తుండగా ఎడిటింగ్ బాధ్యతలను జి.కె. ప్రసన్న చూసుకుంటున్నారు.
ఈ చిత్రం ఒక ఉత్కంఠ భరితమైన డ్రామా-థ్రిల్లర్‌గా ఉండబోతోందని సమాచారం. దీనిని లోకేష్ కనగరాజ్, నవీన్ యెర్నేని , వై. రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక కొన్ని నెలల క్రితం సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. చిత్ర బృందానికి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, షూటింగ్ ప్రారంభం నుండే వేగంగా సాగడంతో, తక్కువ కాలంలోనే సినిమా చిత్రీకరణ పూర్తయింది.



















