Satya Kumar Yadav : అమరావతి : ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ (Satya Kumar Yadav) కీలక ప్రకటన చేశారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాద సంఘటనపై స్పందించారు. ఈ మేరకు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారు ప్రస్తుతం కర్నూలు ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మృతదేహాలు బస్సులోనే ఉన్నాయని అన్నారు. అయితే పరిస్థితులకు అనుగుణంగా సంఘటన స్థలంలో మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించడానికి కూడా తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు సత్య కుమార్ యాదవ్.
AP Health Minister Satya Kumar Yadav Key Comments on Kurnool Bus Fire Incident
ఫోరెన్సిక్ వైద్యులను సంఘటన స్థలానికి పంపించడం జరిగిందని చెప్పారు. మహా ప్రస్థానం వాహనాలు కూడా మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మృతులను గుర్తించడానికి DNA నమూనాలను కూడా సేకరిస్తున్నామని వెల్లడించారు మంత్రి. 12 మంది స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చేరారని , గాయపడిన వారిలో ఆరుగురు ప్రాథమిక చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారని స్పష్టం చేశారు. బస్సు నుండి (ఎత్తు నుండి) దిగిన తర్వాత ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు సత్య కుమార్ యాదవ్. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందన్నారు.
Also Read : DY CM Pawan Kalyan Clear Instructions : సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందించాలి

















