Israel PM : ఇజ్రాయెల్ : ఇజ్రాయెల్ దేశ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహూ (Israel PM) కీలక వ్యాఖ్యలు చేశారు. గాజా బందీల విడుదలకు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు. కాగా గాజా నుంచి పూర్తిగా తమ బలగాలను వైదొలగాలని అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు నెతన్యాహూ. ట్రంప్ అంటే తమకు గౌరవం తో పాటు స్నేహం కూడా ఉందన్నారు. అయినంత మాత్రాన తను ఏది చెబితే అది తల ఊపాలంటే తాము ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు నెతన్యాహు. కాగా గాజా విషయంలో సీరియస్ కామెంట్స్ చేశారు ప్రధానమంత్రి. గాజా నుండి ఇజ్రాయెల్ పూర్తిగా ఉపసంహరించు కోబోమంటూ ప్రకటించారు.
Israel PM Comments
యుద్ధాన్ని ముగించడానికి కొత్త US ప్రణాళికపై సోమవారం ఈజిప్టులో హమాస్‌తో పరోక్ష చర్చలు కొనసాగుతున్నందున రాబోయే రోజుల్లో గాజా నుండి అన్ని బందీలను విడుదల చేస్తామని ప్రకటించాలని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. సాంకేతిక వివరాలను ఖరారు చేయడానికి ఈజిప్టుకు ఒక ప్రతినిధి బృందాన్ని పంపానని చెప్పారు. ఈ చర్చలను కొన్ని రోజుల కాలపరిమితికి పరిమితం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు నెతన్యాహు. హమాస్ అమెరికా ప్రణాళికలోని కొన్ని అంశాలను అంగీకరించినట్లు చెప్పిన తర్వాత ప్రధాన మంత్రి ఇలా మాట్లాడటం విస్తు పోయేలా చేసింది.
ఇదిలా ఉండగా అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ వెంటనే తమ భద్రతా బలగాలను గాజా నుంచి వైదొలగాలని కోరారు. ఈ మేరకు నెతన్యాహూకి సూచించారు. అయితే ప్రధాని తాము ఒప్పుకునేది లేదంటూ చెప్పడం కలకలం రేపింది.
Also Read : PM Modi Important Comments : ఐటీఐ టాపర్లకు ప్రధాని అభినందన
