Sardaar ji 3 : ప్రముఖ పంజాబ్ సింగర్, నటుడు దిల్జిత్ దోసాంజ్, పాకిస్తాన్ నటి హనియా అమీర్ తో కలిసి నటించిన హరర్, కామెడీ మూవీ సర్దార్ జీ -3 (Sardaar ji 3) చిత్రం దుమ్ము రేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ చూరగొంది. కేవలం వారం రోజుల్లోనే ఏకంగా రూ. 33.60 కోట్లు వసూలు చేసింది. చిత్ర నిర్మాతలకు కాసుల పంట పండించేలా చేసింది. అయితే ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారత ప్రభుత్వం పాకిస్తాన్ కు చెందిన మీడియా, డిజిటల్ మీడియా, సినిమాలపై నిషేధం విధించింది. అయితే సర్దార్ జీ చిత్రంలో పాకిస్తాన్ నటి నటించడం పట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. సోషల్ మీడియాలో నటుడు, సింగర్ తీవ్రంగా ట్రోల్స్ కు గురయ్యాడు. అయినా వీటన్నింటిని కాదని ఈ మూవీ కలెక్షన్ల వేట కొనసాగిస్తోంది. అందరినీ విస్తు పోయేలా చేసింది.
Sardaar ji 3 Movie Updates
ఇక సర్దార్ జీ 3 మూవీ గత నెల జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హనియా అమీర్ నటించడంతో వ్యతిరేకత రావడంతో భారత్ లో కొన్ని చోట్ల విడుదల కాలేదు. అయితే వరల్డ్ వైడ్ గా విడుదలై ఆశించిన దానికంటే అద్భుతమైన ఆదరణ చూరగొంది. ఈ సందర్బంగా మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. మా సర్దార్ జీ దుమ్ము రేపాడు. ఇంకా కొనసాగుతూనే ఉన్నాడు. ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నం చేసినా ముందుకు వెళుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని తెలిపారు. గతంలో ఉన్న రికార్డులను సర్దార్ జీ 3 బద్దలు కొట్టిందంటూ ఇన్ స్టా రీల్స్ వేదికగా వెల్లడించింది.
Also Read : Popular Actress – Indira Krishnan : తల్లిగా నటించడం అదృష్టం – ఇందిరా కృష్ణన్
