Ranveer Singh : బాలీవుడ్ లో బాల నటిగా గుర్తింపు పొందిన సారా అర్జున్ సంచలనంగా మారారు. తను తాజాగా రణ వీర్ సింగ్ నటించిన ధురంధర్ మూవీలో హీరోయిన్ గా అరంగేట్రం చేయనుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దీనిని దర్శకుడు స్పై థ్రిల్లర్ గా తీర్చిదిద్దాడు. మూవీ మేకర్స్ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. జియో స్టూడియోస్ తో పాటు సినిమాకు దర్శకత్వం వహించిన ఆదిత్య ధర్ దీనిని నిర్మించారు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ (Ranveer Singh) మారు వేషంలో రా ఏజెంట్ పాత్రను పోషిస్తున్నాడు. యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్‌లో రణవీర్‌తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, కోలీవుడ్ అగ్ర నటుడు ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.
Ranveer Singh-Sara Arjun Movie
ధురంధర్ టీజర్ కు మంచి స్పందన లభించింది. హీరోయన్ గా నటించిన సారా అర్జున్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. కేవలం మూడు ఫ్రేమ్ లలో మాత్రమే కనిపించింది. ఇదిలా ఉండగా 2005లో జన్మించిన సారా అర్జున్ చాలా చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసింది. అంతేకాకుండా తెలుగులో చియాన్ విక్రమ్, అనుష్క శెట్టి నటించిన ‘దైవ తిరుమగల్’ అనే తమిళ చిత్రంతో స్క్రీన్ షేర్ చేసుకుంది.
అంతే కాకుండా సారా అర్జున్ చిన్నతనంలోనే బహుళ ప్రకటనలలో, రెండు చిత్రాలలో కనిపించడం ప్రారంభించింది. మణిరత్నం తీసిన బిగ్ సక్సెస్ అయిన రెండు భాగాల మాగ్నమ్ ఓపస్ అయిన ‘పొన్నియిన్ సెల్వన్’ ఆమెకు అతిపెద్ద బ్రేక్ ఇచ్చింది, ఇది ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసింది.
తను చిన్న వెర్షన్‌ను పోషించింది, ఆమె పరిణతి చెందిన నటనా శైలితో అందరినీ ఆకట్టుకుంది. సారా అర్జున్ మొదట తమిళ చిత్రంలో ప్రధాన నటిగా అరంగేట్రం చేస్తుందని అందరూ భావించారు, కానీ ధురంధర్‌లో ఆమె క్లుప్తంగా కనిపించడం అందరినీ ఆశ్చర్య పరిచింది.
Also Read : Minister Narayana Interesting : పి4 ద్వారా పేద కుటుంబాల దత్తత



















