సంజు శాంస‌న్ ఆస్తుల విలువ రూ. 100 కోట్లు

భార‌తీయ క్రికెట్ లో జ‌నాద‌ర‌ణ పొందిన ప్లేయ‌ర్

hellotelugu-SanjuSamson

హైద‌రాబాద్ : ఒక‌టా రెండా ఏకంగా రూ. 100 కోట్ల ఆస్తుల‌ను క‌లిగి ఉన్నాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్, భార‌త క్రికెట్ టి20 జ‌ట్టు ప్లేయ‌ర్ సంజు శాంస‌న్. భార‌తీయ క్రికెట్ లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన క్రికెట‌ర్ల‌లో త‌ను టాప్ లో ఉన్నాడు. త‌న స్వ‌స్థ‌లం కేర‌ళ‌. త‌న‌ను అంద‌రూ మ‌హేంద్ర సింగ్ ధోనీ త‌ర్వాత ఆరాధిస్తారు. ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) లో త‌ను మోస్ట్ ఫేవ‌ర‌బుల్ ప్లేయ‌ర్ గా గుర్తింపు పొందాడు. అత్య‌ధిక ప‌రుగులు చేశాడు. తాను ప్రాతినిధ్యం వ‌హించిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టును సెమీస్ దాకా తీసుకు వెళ్లాడు. ఆ జ‌ట్టులో అంచెలంచెలుగా ఎదిగిన శాంస‌న్ ఉన్న‌ట్టుండి ఈసారి చెన్నై సూప‌ర్ కింగ్స్ కు మారాడు.

దీని వెనుక పెద్ద క‌థ ఉంది. త‌ను మొద‌ట ఢిల్లీ త‌ర‌పున ఆడాడు. ఆ త‌ర్వాత రాజస్థాన్ లో చేరాడు. ఆ జ‌ట్టుతో కొన్నేళ్ల పాటు అనుబంధం క‌లిగి ఉన్నా ఎందుక‌నో యాజ‌మాన్యం త‌న‌ను వ‌దులు కోవాల‌ని అనుకుంది. మొత్తం మీద సంజు శాంస‌న్ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాడు. ఎందుకంటే త‌న నిక‌ర ఆస్తుల విలువ గురించి ప్ర‌ముఖ మేగ‌జైన్ అవుట్ లుక్ బిజినెస్ త‌న ప‌త్రిక‌లో ప్ర‌త్యేక క‌థ‌నాన్ని రాసింది. ఇందులో తన ఆస్తులు రూ. 100 కోట్లకు పైగానే ఉన్నాయ‌ని వెల్ల‌డించింది. ఇందుకు ఆధారాలు కూడా జ‌త చేసింది. 2026లో రూ. 80 కోట్ల నుంచి100 కోట్లకు చేరింది. జీవనశైలిలో పెరుగుతున్న బ్రాండ్ ఈక్విటీతో, సామ్సన్ నిశ్శబ్దంగా తన శ్రేణిలోని భారతీయ క్రికెటర్లలో బలమైన పోర్ట్‌ఫోలియోలలో ఒకదాన్ని నిర్మించాడు.

Exit mobile version