Sanju Samson : చెన్నై : అందరూ ఊహించని విధంగా కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ (Sanju Samson) ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరాడు. ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించారు. సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది. ఇదే సమయంలో శాంసన్ కు బదులు సీఎస్కే జట్టులో రవీంద్ర జడేజాను ఆర్ఆర్ జట్టుకు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. ఇప్పటికే ఐపీఎల్ వేలం పాటలో అత్యధికంగా ధరకు అమ్ముడు పోయాడు. పెద్ద ఎత్తున సంజూ శాంసన్ కు బిగ్ డిమాండ్ నెలకొంది. తన ధర రూ. 18 కోట్లు. తను టాప్ ప్లేయర్ గా ఉన్నాడు. బ్యాటర్ , వికెట్ కీపర్ , కెప్టెన్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కొన్నేళ్లపాటు సేవలు అందించాడు. ఆ జట్టును ఫైనల్ వరకు తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు.
Sanju Samson Joined in Chennai Super Kings
ఒక్క సంజూ శాంసన్ కోసం పలు జట్ల యాజమాన్యాలు పోటీ పడ్డాయి. తనను తీసుకునేందుకు మొదటగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ ప్రయత్నం చేశాయి. శాంనన్ ను తీసుకునేందుకు గాను రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇద్దరు కీలక ఆటగాళ్లను అడిగింది. రవీంద్ర జడేజాతో పాటు శామ్ కరన్ ను తీసుకుంది. జడేజా ధర రూ. 14 కోట్లు కాగా శామ్ కరన్ రూ. 2.4 కోట్లు చెల్లించేందుకు ఇరు జట్లు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ ను విజయ తీరాలకు చేర్చిన ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శాంసన్ ను తీసుకోవాలని కోరినట్లు సమాచారం. మొత్తంగా ఉత్కంఠకు తెర పడింది.
Also Read : CJI Justice Gavai Important Visit : రేపే విజయవాడకు సీజేఐ జస్టిస్ గవాయ్ రాక


















