కేరళ : స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాడు. తను ఒంటి చేత్తో భారత జట్టును సెమీ ఫైనల్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్బంగా తన గురించి కోచ్ జుబిన్ భరుచా స్పందించాడు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను అద్బుతమైన క్రికెటర్ అని ప్రశంసలు కురిపించాడు. నేను అతనికి (సంజు సామ్సన్) చాలా కాలంగా శిక్షణ ఇస్తున్నాననేది అవాస్తవం అని పేర్కొన్నాడు కోచ్ జుబిన్ భరూచా. అతను మొదటిసారి నా దగ్గరకు వచ్చినప్పుడు అతను చాలా చిన్నవాడు. స్థితిస్థాపకత అతని ముఖ్య లక్షణం అని కితాబు ఇచ్చాడు. ఏ ఆటగాడికైనా కావాల్సింది ముందుగా తమ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం.
ఇది తను ముందు నుంచి చేస్తూ వచ్చాడని సంజూ శాంసన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు కోచ్. కానీ అతనిలో అద్భుతమైనది ఏమిటంటే అతను ఎలాంటి వ్యక్తి అనేది అతను ఆడుతున్న విధానంలో, షాట్స్ ఆడే విధానంలో , అతని బ్యాటింగ్‌లో ప్రతిబింబిస్తుందని స్పష్టం చేశాడు జుబిన్ భరూచా. దానికి స్వచ్ఛత అనే భావన ఉందన్నాడు. దాదాపు ఆధ్యాత్మిక స్వభావం కూడా శాంసన్ లో బలంగా ఉందన్నాడు. తన వ్యక్తిగత పరుగులు లేదా విజయాల కంటే తన చర్చిలోని ప్రజలను జాగ్రత్తగా చూసుకున్నాడా లేదా అనే దాని గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తాడని తెలిపాడు. ఒక వ్యక్తిగా అతను ఎవరో అంతే, అతని స్ట్రోక్‌ప్లే స్వచ్ఛతలో మీరు దానిని చూడవచ్చని పేర్కొన్నాడు కోచ్. అది కొంచెం లోతుగా ఉంటుందని నాకు తెలుసు కానీ నేను దానిని అలా చూస్తానని చెప్పాడు .



















