చెన్నై : భారత జట్టు మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తాజాగా జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను 8 వికెట్ల తేడాతో ఓడించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ఓ వైపు వికెట్లు కోల్పోయినా చాలా సంయమనంతో ఆడటమే కాకుండా మ్యాచ్ చివరి దాకా నిలబడి విజయం చేకూర్చడంలో కీలక పాత్ర పోషించిన కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ను ఆకాశానికి ఎత్తేశాడు. తన ఆట తీరు గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నాడు. అతను ముగ్గురు ప్రధాన బౌలర్లను తెలివిగా ఎదుర్కొని బాధ్యత తీసుకున్నాడు. చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు మ్యాచ్ గెలిపించాడు. అదే సంజు ఇన్నింగ్స్ లోని గొప్పతనం. అతని గొప్ప లక్షణం ఏమిటంటే, అతను ఆడే పెద్ద ఇన్నింగ్స్‌లు మ్యాచ్ గెలిపిస్తాయి. అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అవసరమైన రన్ రేట్ గురించి ఆందోళన చెందుతూ ఎప్పుడూ కలవర పడలేదన్నాడు శ్రీకాంత్.
ముఖ్యంగా కవర్ ప్రాంతంలో అతను షాట్లు కొట్టిన విధానం అద్భుతంగా ఉంది. స్టార్క్, ఎంగిడి వేసిన ఓపెనింగ్ స్పెల్స్‌ను ఎదుర్కోవడం అత్యంత ముఖ్యం అని తెలుసుకుని అతను తెలివిగా ఆడాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌కు పట్టు లభిస్తోందని అతనికి తెలుసు, అందుకే అతన్ని గౌరవించాడని తెలిపాడు శ్రీకాంత్ . మరో వైపు అకీల్ హోసేన్ సైతం స్పందించాడు శాంసన్ గురించి. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్ సాగిన తీరు చూశాక, అనుభవం చాలా కీలకం. ఇది సులభమైన ఛేజింగ్ కాదు, కష్టంగా కూడా ఉండేది. సంజు దాన్ని అద్భుతంగా నిర్వహించాడు. అతను డ్రెస్సింగ్ రూమ్‌ను ప్రశాంతంగా ఉంచి, ఆ యువ ఆటగాడికి అద్భుతంగా మార్గనిర్దేశం చేశాడు. వారిద్దరికీ అభినందనలు తెలిపాడు.
ఈ మ్యాచ్‌లోనే కాదు, ఈ సెషన్ అంతటా మాకు సంజునే ప్రధాన ఆటగాడిగా నిలిచాడు. అతను స్పిన్నర్లను ఎదుర్కొనే తీరు చూస్తే కొన్నిసార్లు అతనికి బౌలింగ్ చేయాల్సిన అవసరం నాకు లేనందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటానని నవ్వుతూ అన్నాడు.



















