Sanju Samson : కేరళ క్రికెట్ లీగ్ లో అద్బుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నా సంజూ శాంసన్ కు ఆసియా కప్ తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా కనిపిస్తోంది. క్రికెట్ వర్గాలన్నీ ముక్త కంఠంతో సంజూకు ఛాన్స్ ఇవ్వాలని కోరినా వర్కవుట్ అయ్యేలా లేదు. ప్రధానంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తుది నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం శుభ్ మన్ గిల్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. తనను తప్పించే ఛాన్స్ లేదు. ఇక ఎలాగూ జితేష్ శర్మ ఓపెనర్ గా వస్తాడని ఇప్పటికే బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ప్రకటించేశాడు. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. ప్రధాన ఆటగాడిని కావాలని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు ఫ్యాన్స్.
Sanju Samson Sensational
ఇక సంజూ శాంసన్ (Sanju Samson) ఏకంగా కేసీఎల్ టోర్నీలో నాలుగు ఇన్నింగ్స్ లలో 36 సిక్సులతో విరుచుకు పడ్డాడు. నాలుగు హాఫ్ సెంచరీలతో పాటు ఓ సూపర్ సెంచరీ ఉంది. అయినా పక్కన పెడుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఇవాల్టి నుంచి దుబాయ్ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 10న బుధవారం ఆతిథ్య యూఏఈ వేదికగా కీలకమైన మ్యాచ్ ను ఆడబోతోంది సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా ఢీకొన బోతోంది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అన్ని ఫార్మాట్లలో బహుళ నైపుణ్యం కలిగిన ఆటగాళ్లపై, ముఖ్యంగా లైనప్ 8వ నెంబరు వరకు పరుగులు జోడించగలదని నిర్ధారించు కోవడానికి బ్యాటింగ్ లోతును జోడించగల వారిపై నొక్కి చెప్పాడు. చివరకు శాంసన్ ఉండక పోవచ్చని అంచనా.
Also Read : KTR Sensational Comments : బీఆర్ఎస్ ఏ పార్టీకి బి టీమ్ కాదు : కేటీఆర్
