భ‌విష్య‌త్తులో ఇండియా  త‌ర‌పున ఆడుతానో లేదో

అభిమానుల‌కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్ 

hellotelugu-SanjuSamson

కేర‌ళ :  కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు  చేశాడు. త‌ను మంగ‌ళ‌వారం మీడియా ముందుకు వ‌చ్చాడు. తాను ఆశించిన రీతిలో ఆడ‌లేక పోయాన‌ని, దీనికి త‌న‌దే బాధ్య‌త అని అన్నాడు. తాను ఎవ‌రినీ నిందించ‌ద‌ల్చు కోలేదన్నాడు. ఒక్కోసారి ప్ర‌తి ఆట‌గాడికి ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితి  ఎదుర‌వుతుంద‌న్నాడు సంజూ శాంస‌న్. ఈ సంద‌ర్బంగా త‌న‌ను నమ్మిన ప్రతి ఒక్కరికీ నేను క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నాడు. ఇదే స‌మ‌యంలో  నేను వారి నమ్మకాన్ని నిలబెట్టుకోలేక పోయానంటూ వాపోయాడు. భవిష్యత్తులో మేనేజ్‌మెంట్ నాకు ఆడే అవకాశం ఇస్తుందో లేదో నాకు తెలియదన్నాడు.

కానీ నేను నా జట్టుకు మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తానని స్ప‌ష్టం చేశాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్. ప్ర‌స్తుతం త‌న కెరీర్ అంధ‌కారంలో ప‌డింది. త‌న‌ను ఏరికోరి బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్, హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్, జ‌ట్టు స్కిప్ప‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ లు  మ‌ద్ద‌తుగా నిలిచారు. త‌న‌కు స్వ‌దేశంలో న్యూజిలాండ్ తో జ‌రిగిన టి20 సీరీస్ లో ఆడే ఛాన్స్ ఇచ్చారు. కానీ వ‌రుస‌గా త‌ను 5 మ్యాచ్ లు ఆడాడు. కానీ త‌ను కేవ‌లం 50 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. 10, 6, 0, 24, 6 ర‌న్స్ మాత్ర‌మే చేసి తీవ్ర నిరాశ ప‌రిచాడు. త‌న‌ను వికెట్ కీప‌ర్, బ్యాట‌ర్ గా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్  కు ప్ర‌మోట్ కూడా చేశారు. కానీ అద్భుత‌మైన చాన్స్ ను మిస్ చేసుకున్నాడు సంజూ శాంస‌న్. త‌ను తాజాగా చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.

Exit mobile version