Sandeep Reddy Vanga : జిగ్రిస్ మూవీ తప్పకుండా అన్ని వర్గాలను ఆకట్టు కోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు డైనమిక్ డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga). దీనిని ప్రతి ఒక్కరు చూడాలని, ఆదరించాలని కోరాడు. జిగ్రీస్ చిత్రం టీజర్ ను రిలీజ్ చేశాడు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాను నిర్మించింది నా స్నేహితుడు వోడపల్లి కృష్ణ. తను నాకు ఎల్కేజీ నుంచి మిత్రుడు. తను గనుక ముందే చెప్పి ఉంటే సినిమా తీయొద్దంటూ చెప్పేవాడనని అన్నారు. తనకు చెప్పకుండానే ముందుకు వెళ్లి సినిమా తీశాడని అన్నారు.
Sandeep Reddy Vanga Key Comments on Jigris Movie
తాను యానిమల్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన ఫోన్ చేసి, గోవాలో ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయిందని చెప్పాడని, దీంతో తాను ఫోన్ లోనే తిట్టడం మొదలు పెట్టానని అన్నారు వంగా సందీప్ రెడ్డి. ఎందుకు ఇలా చేశావని మండిపడ్డానని చెప్పాడు వంగా సందీప్ రెడ్డి. ఆ తర్వాత హైదరాబాద్ కు వచచ్చినప్పుడు తను కొన్ని విజువల్స్ చూపించాడు జిగ్రిస్ గురించి. అవి చాలా బాగున్నాయని అనిపించిందన్నాడు. టీజర్లో నేను చూసిన దానికంటే సినిమాలో కామెడీ చాలా ఎక్కువగా ఉంది. తెలుగు ప్రేక్షకుల గొప్ప లక్షణం ఏమిటంటే, నిర్మాత లేదా దర్శకుడితో వారి సంబంధం ఎలా ఉన్నా, సినిమా బాగుంటే, వారు దానిని బ్లాక్‌బస్టర్‌గా చేస్తారని అన్నారు వంగా సందీప్ రెడ్డి.
Also Read : Minister Nara Lokesh Warning : మహిళల జోలికి వస్తే ఊరుకోను – లోకేష్


















