Spirit Movie Updates : స్పిరిట్ కొత్త‌గా ఉండ‌బోతోంది : వంగా సందీప్ రెడ్డి

త్వ‌ర‌లోనే డార్లింగ్ ప్ర‌భాస్ తో మూవీ షూటింగ్ స్టార్ట్

Hello Telugu - Spirit Movie Updates

Hello Telugu - Spirit Movie Updates

Spirit : హైద‌రాబాద్ : పాన్ ఇండియా ద‌ర్శ‌కుడు వంగా సందీప్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఇప్ప‌టికే తాను ప్ర‌భాస్ తో సినిమా తీస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. దానికి కూడా పేరు పెట్టాడు. ఇందులో యానిమల్ లో కీ రోల్ పోషించిన త్రిప్తి దిమ్రీ హీరోయిన్ గా ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించ‌నుంద‌ని తెలిపాడు. తాజాగా టాలీవుడ్ హీరో జ‌గ‌ప‌తి బాబు నిర్వ‌హిస్తున్న జ‌య‌మ్ము నిశ్చ‌యమ్ము రా షోకు హాజ‌ర‌య్యాడు వంగా సందీప్ రెడ్డి. త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నాడు. స్పిరిట్ (Spirit) మూవీ త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళుతుంద‌ని చెప్పాడు. కానీ గ‌తంలో తాను తీసిన అర్జున్ రెడ్డి, యానిమ‌ల్ సినిమాల కంటే భిన్నంగా ఉండ బోతోంద‌ని ప్ర‌క‌టించాడు. ఇందులో ఎలాంటి సందేహం లేద‌న్నాడు.

Director Sandeep Reddy Vanga Key Comments on Spirit Movie

ఎప్ప‌టి నుంచో ప్ర‌భాస్ తో సినిమా తీయాల‌ని ఉంద‌ని, అందుకే త‌న కోస‌మే క‌థ రాసుకున్నాన‌ని చెప్పాడు వంగా సందీప్ రెడ్డి. భారీ ఖర్చు పెట్టేందుకు సిద్దంగా ఉన్నార‌ని తెలిపాడు. అన్ని హంగులు ఇందులో ఉంటాయ‌ని , కానీ ఇప్ప‌టికే క‌థ‌ను రివీల్ చేయాల‌ని అనుకోవ‌డం లేద‌న్నాడు ద‌ర్శ‌కుడు. భార‌త దేశ సినీ చ‌రిత్ర‌లో స్పిరిట్ ఓ సెన్సేష‌న్ కావ‌డం ప‌క్కా అని ధీమా వ్య‌క్తం చేశాడు . అయితే సెట్ లో బ్యాక్ గ్రౌండ్ సంగీతం ప్లే అవుతుంటే సినిమా చిత్రీక‌ర‌ణ మ‌రింత సుల‌భం అవుతుంద‌ని, ఇలా చేయ‌డం త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని పేర్కొన్నాడు వంగా సందీప్ రెడ్డి. కబీర్ సింగ్ చిత్రీకరణ సమయంలో, నిర్మాణం ప్రారంభించే ముందు నేపథ్య సంగీతం పూర్తయితే, షూటింగ్ చాలా సున్నితంగా మారుతుందని నేను గ్రహించాన‌ని చెప్పాడు.

Also Read : Shocking Comments CM Siddaramaiah : సీఎంపై కామెంట్స్ కేసు న‌మోదు

Exit mobile version