అహ్మదాబాద్ : ఐసీసీ టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో ఓటమి అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ గురించి న్యూజిలాండ్ స్కిప్పర్ మిచెల్ సాంట్నర్. తను మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్బంగా పాకిస్తాన్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తమ దేశానికి చెందిన సహబ్జాదా ఫర్హాన్ 383 పరుగులు చేశాడని, కానీ సంజు సామ్సన్‌కు మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ లభించిందని , ఎలా ఇస్తారంటూ ప్రశ్నించాడు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారని అడగడంతో కీలక సమాధానం ఇచ్చాడు మిచెల్ సాంట్నర్. ఇంతకు షెహబ్జాదా ఫర్హాన్ ఎవరు అంటూ ఎదురు ప్రశ్న వేశాడు.
ఈ సందర్బంగా సంజు శాంసన్ ఆట తీరు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు కీవీస్ కెప్టెన్. అవార్డులు అనేవి వ్యక్తిగతంగానో లేక తమకు నచ్చిన వారికి ఇవ్వరని, ఆ విషయం తెలుసుకుంటే మంచిదని హితవు పలికాడు. అవార్డులు అనేవి ఇంపాక్ట్ ఆధారంగా ఇవ్వబడతాయని చెప్పాడు మిచెల్ సాంట్నర్. సంజు శాంసన్ 3 అసాధారణ ఇన్నింగ్స్‌లు ఆడాడని ప్రశంసించాడు. తను కీలకమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఒకానొక దశలో విండీస్ గెలిచే స్థితిలో ఉందని, కానీ తను ఒంటరి పోరాటం చేసి గెలిపించాడన్నాడు. ఆ తర్వత సెమీస్ లో ఇంగ్లండ్ తో సైతం తను 89 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడని కితాబు ఇచ్చాడు. ఇక తమతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తను అసారాణమైన ఆట తీరును ప్రదర్శించాడని, తమ బౌలర్లకు చుక్కలు చూపించాడని తెలిపాడు. అందుకే తనకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ లభించిందని చెప్పాడు.


















