Samantha Interesting Comments : గ‌తంలో కంటే ఇప్పుడు సంతోషంగా ఉన్నా

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన స‌మంత రుత్ ప్రభు

Hello Telugu - Samantha Interesting Comments

Hello Telugu - Samantha Interesting Comments

Samantha : ఢిల్లీ : ప్ర‌ముఖ న‌టి స‌మంత రుత్ ప్ర‌భు (Samantha) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఆమె తాజాగా చేసిన కామెంట్స్ సినీ ప‌రిశ్ర‌మ‌లో ముఖ్యంగా నాగార్జున ఫ్యామిలీలో క‌ల‌క‌లం రేపేలా ఉన్నాయి. త‌న జీవితంలో గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఇప్పుడు ప్ర‌శాంతంగా, అంత‌కు మించి ఆనందంగా ఉంద‌ని అన్నారు. ఇది త‌న‌ను మ‌రింత సంతోషానికి లోన‌య్యేలా చేస్తోంద‌న్నారు. సినీ కెరీర్, త‌న‌కు ఉన్న డిసీజ్ గురించి కూడా ఓపెన్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ‌. ఈ మ‌ధ్య‌న ద‌ర్శ‌కుడు రాజ్ నిడిమూరుతో డేటింగ్ చేస్తోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ 52వ జాతీయ మేనేజ్‌మెంట్ కన్వెన్షన్‌లో స‌మంత రుత్ ప్ర‌భు ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించింది.

Actress Samantha key Comments

త‌న మ‌న‌సులోని అభిప్రాయాల‌ను నిర్భ‌యంగా పంచుకుంది. గత సంవత్సరం తన వ్యక్తిత్వం ఎలా అభివృద్ధి చెందిందో ప్రతిబింబిస్తూ, తాను సున్నితమైన వ్యక్తి నుండి తన స్వంత విలువను అర్థం చేసుకునే వ్యక్తిగా రూపాంతరం చెందానని చెప్పింది. మైయోసైటిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్, సినిమా పరిశ్రమపై మారుతున్న దృక్పథంతో తాను చేసిన నిరంత‌ర పోరాటాల గురించి కూడా తెలియ చేసింది సమంత రుత్ ప్ర‌భు. తాను టాప్ స్టార్ గురించి ప‌ట్టించుకోన‌ని తెలిపింది. కేవ‌లం త‌న ఆరోగ్యం, కెరీర్ పై నే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడ‌తాన‌ని చెప్పింది న‌టి. గ‌త ఏడాదిలో 5 సినిమాలు విడుద‌లైన‌ట్లు పేర్కొంది. నేను ఏ జాబితాలో లేన‌ని , త‌న వ‌ద్ద రూ. 1000 కోట్ల సినిమా అస‌లు లేద‌ని దెప్పి పొడిచింది.

Also Read : Hero Dulquer Salmaan-Pooja Hegde : దుల్క‌ర్ స‌ల్మాన్ తో జ‌త‌క‌ట్టిన ముద్దుగుమ్మ‌

Exit mobile version