Beauty Samantha : అందం గురించి అంత‌గా ప‌ట్టించుకోను

ప్ర‌ముఖ న‌టి సమంత రుత్ ప్ర‌భు కామెంట్స్

Hello Telugu - Beauty Samantha

Hello Telugu - Beauty Samantha

Samantha : ముంబై : ప్ర‌ముఖ న‌టి స‌మంత రుత్ ప్ర‌భు (Samantha) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. త‌న 30 ఏళ్ల జీవితం గురించి ప్ర‌త్యేకంగా ప్రస్తావించింది. చూస్తూ ఉండ‌గానే 30 ఏళ్లు గ‌డిచి పోయాయి. ఈ ప్ర‌యాణంలో ఎన్నో ఒడిదుడుకులు, మ‌రెన్నో ఇబ్బందులు ఉన్నాయ‌ని పేర్కొంది. చైత‌న్య‌తో విడి పోవ‌డం పైన కూడా స్పందించింది. ఏది ఎప్పుడు ఎలా జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరంటూ తెలిపింది. ఎంద‌రో వ్య‌క్తులు ప‌రిచయం అయ్యారు. ఇంకొంద‌రు అలా వ‌చ్చి ఇలా వెళ్లి పోయారంటూ న‌ర్మ గ‌ర్భంగా పంచుకుంది ఈ న‌టి. త‌న స్నేహితురాలు అవ్ని రాంబియాతో జ‌రిపిన సంభాష‌ణ‌కు సంబంధించి వీడియోను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంది.

Samantha Key Comments

ఇటీవల జరిగిన ఫోటోషూట్ సందర్భంగా ఇన్ స్టా లో ఫోటోలు పంచుకుంది. ప్ర‌త్యేకించి స్త్రీత్వం, స్వీయ-ఆవిష్కరణ, నిజమైన ప్రేమ ఆలోచన గురించి హృదయపూర్వక గమనిక రాశారు. కెమెరా ముందు నిల‌బ‌డ‌టం అన్న‌ది స‌వాల్ తో కూడుకున్నద‌ని పేర్కొంది న‌టి సమంత‌. ఈ ముప్పై ఏళ్ల తర్వాత ప్రపంచం మీకు ప్రతిదీ చెబుతుంది. మీ ప్రకాశం మసక బారుతుంది, మీ అందం జారిపోతుంది . మీరు మీ ఇరవైలలో ప్రతిదీ కావడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. పరిపూర్ణ ముఖం, పరిపూర్ణ శరీరం, పరిపూర్ణ జీవితం సమయం గడిచి పోతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంద‌ని పంచుకుంది. త‌ను నాగ చైత‌న్య‌తో విడి పోయాక ద‌ర్శ‌కుడు రాజ్ నిడుమూరుతో క‌లిసి డేటింగ్ చేస్తోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకు సంబంధించి ఈ ఇద్ద‌రు ఖండించ లేదు.

Also Read : Deputy CM Bhatti Challenge : స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుతాం

Exit mobile version