సల్మాన్ ఖాన్ దిల్ రాజు చిత్రం ముంబైలో ప్రారంభం

ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న వంశీ పైడిప‌ల్లి

hellotelugu-SalmankhanNaayantara

ముంబై : ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న మూవీ ముంబై వేదిక‌గా ప్రారంభ‌మైంది. ఈ చిత్రానికి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దీనిని భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ డ్రామా చిత్రంగా తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ టాప్ హీరో స‌ల్మాన్ ఖాన్, ద‌క్షిణాది తార న‌య‌న‌తార కీ రోల్ పోషించ‌నున్నారు. దిల్ రాజు భారీ ఖ‌ర్చు పెట్ట‌నున్నారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి ప‌ని చేస్తుండ‌డం విశేషం. గ‌తంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ తో దిల్ రాజు ఓ మూవీ తీశాడు. దానిని పూర్తిగా కుటుంబ క‌థా చిత్రంగా తెర‌కెక్కించాడు. మ‌రో వైపు స‌ల్మాన్ ఖాన్, న‌య‌న్ క‌లిసి తొలిసారిగా న‌టించ‌డం విశేషం.

దిల్ రాజు , వంశీ , స‌ల్మాన్ ఖాన్, న‌య‌న్ ల కాంబినేష‌న్ పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. వీరి క‌ల‌యిక ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ఆస్వాదించేలా ఉంటుంద‌ని పేర్కొంటున్నారు సినీవ‌ర్గాలు. వీరి కాంబో షూటింగ్ ప్రారంభ‌మైంది. ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ, చిత్ర కథానాయికగా నయనతార షూటింగ్ సెట్‌లో చేరారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ వినోదాత్మక చిత్రం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ కాంబినేషన్ గురించి ఇప్పటికే అన్ని సినీ పరిశ్రమలలోనూ భారీ చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రానికి తాత్కాలికంగా ఎస్వీసీ63గా పేరు పెట్టారు. సంప్రదాయ ముహూర్త కార్యక్రమంతో ప్రారంభమై, వెంటనే నిర్మాణ పనులను మొదలు పెట్టింది.

Exit mobile version