Saiyaara : ముంబై – అమిత్ పూరి దర్శకత్వం వహించిన సైయారా (Saiyaara) ప్రేమకథా చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ. 300 కోట్లను దాటిన మూవీగా చరిత్ర సృష్టించింది. ఆకట్టుకునే సన్నివేశాలు, అద్భుతమైన కథ, నటీ నటుల ప్రదర్శనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు పోయింది. ఎక్కడ చూసినా ప్రేక్షకులు ముఖ్యంగా యువతీ యువకులు సైయారా మ్యాజిక్ కు ఫిదా అయ్యారు. బాక్సులు కాసులతో నిండి పోయాయి. ఊహించని రీతిలో ఎలాంటి ప్రచారం లేకుండానే దుమ్ము రేపింది సైయారా.
Saiyaara Movie Collections
ఈ చిత్రం 12వ రోజుకు ఈ ఏడాదిలో అతి తక్కువ కాలంలో 500 శాతం వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలవడం విశేషం. ఇందులో అహాన్ పాండే, అనీత్ పడ్డా కీ రోల్స్ పోషించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇందులో జీవించేశారు. కన్నీళ్లు పెట్టించేలా చేశారు.. రెండవ సోమవారం బలమైన పట్టును కొనసాగించిన తర్వాత, ఈ చిత్రం మంగళవారం పైకి ట్రెండ్‌ను చూసింది. దీనితో, ఇది భారతీయ బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల మార్కును దాటింది. డిస్కౌంట్ టికెట్ రేట్ల కారణంగా ఈ రొమాంటిక్ డ్రామా సినిమా ఎక్కువ మందిని ఆకర్షించింది. మొత్తం మీద ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలించింది. రూ. 270.75 కోట్ల నికర వసూళ్లను సాధించింది. GSTకి సర్దుబాటు చేస్తే ఇది 319.48 కోట్ల గ్రాస్ వద్ద ఉంది.
Also Read : CM Chandrababu Invites Huge Industries : పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సురక్షితం – సీఎం


















