Saiyaara Success Updates : ప్రేమ క‌థా స‌మ్మేళ‌నం కాసుల వ‌ర్షం

సైయారా చిత్రం బాలీవుడ్ లో ప్ర‌భంజ‌నం

hellotelugu-saiyaara

Saiyaara : ఏ ముహూర్తంలో ద‌ర్శ‌కుడు మోహిత్ సూరి సైయారా (Saiyaara) సినిమా తీశాడో కానీ యూత్ అంతా ఫిదా అయ్యారు. జేజేలు ప‌లుకుతున్నారు. నేటి త‌రానికి స్వ‌చ్ఛ మైన ప్రేమ ఎలా ఉంటుందో తెర మీద చూపించి విస్తు పోయేలా చేశాడు. ఇది కొత్త వారితో తీసినా క్రెడిట్ మొత్తం ద‌ర్శ‌కుడికి ఇచ్చి తీరాల్సిందే. త‌న అద్భుత‌మైన ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌తో సినిమాను ఓ రేంజ్ లోకి తీసుకు వెళ్లిన ఘ‌న‌త సూరిదేనంటూ ప్ర‌శంస‌లు కురిపించాడు దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు సుభాష్ ఘాయ్.

Saiyaara Movie Success Updates

విడుద‌లైన ఈ చిత్రం బాక్సుల‌ను బ‌ద్ద‌లు కొడుతోంది. ఏకంగా కేవ‌లం 10 రోజుల్లోనే రూ. 250 కోట్ల క్ల‌బ్ లోకి చేరి పోయింది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుందో తెలియ‌దు. సినీ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. కాసులు కొల్ల‌గొడుతూ ఎక్క‌డా ఆగ‌కుండా ప‌రుగులు తీస్తోంది. ఇప్ప‌టికీ జ‌నం సైయారాను చూసేందుకు క్యూ క‌డుతున్నారు. రిలీజ్ అయిన టాకీసులన్నీ క‌ళ క‌ళ లాడుతున్నాయి. ప్ర‌ధానంగా యూత్ ఈ సినిమాకు ఎక్కువ‌గా క‌నెక్ట్ అయ్యారు.

ద‌ర్శ‌కుడు మోహిత్ సూరి ఇలాంటి సినిమాల‌ను తీయ‌డంలో గ‌తంలో పేరు పొందాడు. ఈసారి ప్రేమ క‌థ‌ను భిన్నంగా రూపొందించాడు. ఈ మూవీలో హీరో హీరోయిన్ల‌ను కొత్త‌గా చూపించాడు. కొత్త వారితో సినిమాను పండించాడు. ఇందులో త‌మ‌కు ఇచ్చిన పాత్ర‌ల‌కు పూర్తిగా న్యాయం చేశారు. ద‌ర్శ‌కుడు కోరుకున్న దానికంటే ఎక్కువ లీన‌మై పోయి న‌టించారు అహాన్ పాండే, అనీత్ ప‌ద్దా. ప్ర‌తి రోజూ ఈ సినిమా క‌లెక్ష‌న్స్ రూ. 20 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేస్తోంది. అరుదైన రికార్డు న‌మోదు చేసేందుకు రెడీ అయ్యింది.

Also Read : Beauty Shruti Haasan : ఫెయిల్యూర్..స‌క్సెస్ డోంట్ కేర్ – శ్రుతీ హాస‌న్

Exit mobile version