Beauty Shruti Haasan : ఫెయిల్యూర్..స‌క్సెస్ డోంట్ కేర్ – శ్రుతీ హాస‌న్

లోకేష్ క‌న‌గ‌రాజ్ కూలీ మూవీలో కీ రోల్

Hello Telugu - Beauty Shruti Haasan

Hello Telugu - Beauty Shruti Haasan

Shruti Haasan : యావ‌త్ ప్ర‌పంచ‌మంతా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన కూలీ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు లోకేష్ క‌న‌గ‌రాజ్. ఇప్ప‌టికే ఆగ‌స్టు 14న రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించాడు. దీంతో అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. విడుద‌లైన పోస్ట‌ర్స్, టీజ‌ర్, సాంగ్స్ కు సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక స్పెష‌ల్ సాంగ్ ఓ మోనికా పాట దుమ్ము రేపుతోంది. ఈ త‌రుణంలో ఇందులో ముఖ్య భూమిక పోషించిన సూప‌ర్ స్టార్ ఇల‌య నాయ‌గ‌న్ కూతురైన న‌టి శ్రుతీ హాస‌న్ (Shruti Haasan) స్పందించింది. చిట్ చాట్ సంద‌ర్బంగా త‌న మ‌న‌సులోని అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేసింది.

Shruti Haasan Key Comments

కొంద‌రు న‌న్ను ఐరెన్ లెగ్ అన్నారు. ఇంకొంద‌రు న‌న్ను ల‌క్కీ గ‌ర్ల్ గా అభివ‌ర్ణించారు. తాను స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించాను. తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ , ర‌వితేజ త‌దిత‌రుల‌తో న‌టించా. త‌మిళంలో ధ‌నుష్ , హిందీలో కూడా చేశా. కానీ తాను ఏ సినిమాలు చేస్తున్నాన‌నే దానిపై ఫోక‌స్ ఉండ‌ద‌న్నారు. అంతే కాదు తాను వృత్తి ప‌రంగా మాత్ర‌మే ఆలోచిస్తాన‌ని , ఫెయిల్ అయ్యిందా లేక పాస్ అయ్యిందా కోట్లు వ‌చ్చాయా అన్న దానిపై త‌న దృష్టి ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది ఈ ముద్దుగుమ్మ‌. అంత టైమ్ అంటూ త‌న‌కు ఉండ‌ద‌న్నారు. మ‌నకు న‌చ్చిన పాత్ర‌లు ద‌క్కితే వాటికి న్యాయం ఎలా చేయాల‌నే దానిపై ఆలోచిస్తాన‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌.

ఒక ర‌కంగా చెప్పాలంటే ఫెయిల్యూర్ స‌క్సెస్ ను తాను ప‌ట్టించుకోనంటూ ప్ర‌క‌టించింది. ఇక సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. త‌న తండ్రితో స‌మానంగా న‌టిస్తూ వ‌స్తున్నారు. తాను ఈ ఇద్ద‌రి నుంచి ఎంతో నేర్చుకున్నాన‌ని , వారి ముందు తాను ఎంత అని పేర్కొన్నారు. త‌లైవాతో న‌టించ‌డం మ‌రిచి పోలేన‌ని , ఇందుకు త‌న‌కు ఛాన్స్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ కు థ్యాంక్స్ చెప్పింది శ్రుతీ హాస‌న్.

Also Read : Hero Vijay Deverakonda – Venkateswara Swamy : శ్రీ‌వారి ద‌య ఉంటే నా సినిమా స‌క్సెస్

Exit mobile version