Saiyaara : బాలీవుడ్ లో ప్రభంజనం సృష్టిస్తోంది విడుదలైన నాటి నుంచి మోహిత్ సూరి దర్శకత్వం వహించిన సైయారా మూవీ. కొత్త వారితో తీసిన ఈ సినిమా కోట్లు కురిపిస్తోంది. బాక్సులు బద్దలు కొడుతోంది. విడుదలైన అన్ని చోట్లా కలెక్షన్స్ తో దూసుకు పోతోంది. ప్రేమ కథను భిన్నంగా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ సందర్బంగా ఈ చిత్రం పూర్తిగా దర్శకుడిదేనని పేర్కొన్నాడు డైనమిక్ డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి. ఇదే సమయంలో మరో దిగ్గజ దర్శకుడు సుభాష్ ఘాయ్ అయితే ఏకంగా దీనిని క్లాసిక్ మూవీగా అభివర్ణించాడు. ఈ సినిమాను చూసిన వాళ్లంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. కొందరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
Saiyaara Movie Success
ఇది పక్కన పెడితే సైయారా (Saiyaara) చిత్రం గురించి విలక్షణ దర్శకుడు మహేష్ భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సైయారా చిత్రం అద్భుతంగా ఉండొచ్చు కాదనలేం. కానీ అందులో ఎలాంటి వాస్తవికతం లేదని పేర్కొన్నాడు. విచిత్రం ఏమింటే సయ్యారాను తీసిన మోహిత్ సూరి మహేష్ భట్ కు స్వయానా మేనల్లుడు కావడం విశేషం. ఆషికి 2 చిత్రాన్ని 2013లో తీశాడు. తను తెలివైన యువకుడు. అతడికి తనదైన శైలి ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి చిత్రాలు తన నుంచి వస్తాయని తనకు నమ్మకం ఉందన్నాడు. ఇటీవలి కాలంలో పరిశ్రమకు అసలు స్వరం లేదంటూ పేర్కొన్నాడు. ఇదే సమయంలో అనుపమ్ ఖేర్ కు చెందిన తన్వి ది గ్రేట్ మూవీని ప్రశంసించారు మహేష్ భట్.
Also Read : India-US Trade War Sensational : భారత్ పై 25 శాతం సుంకం విధిస్తామంటూ ట్రంప్ హెచ్చరికలు


















