Saiyaara Success : సైయారా చిత్రం అద్భుతం – సుభాష్ ఘాయ్

కంటెంట్ బాగుంటే మూవీ స‌క్సెస్ ఖాయం

Hello Telugu - Saiyaara Success

Hello Telugu - Saiyaara Success

Saiyaara : బాలీవుడ్ లో ఇప్పుడు ఒకే ఒక్క మూవీ సంచ‌ల‌నంగా మారింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండానే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సైయారా మూవీ కేవ‌లం 10 రోజుల్లోనే రూ. 250 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. సినీ వ‌ర్గాలు సైతం విస్తు పోయాయి. ద‌ర్శ‌కుడు మోహిత్ సూరి అద్భుతంగా తెర‌కెక్కించాడు క‌థ‌ను. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఈ చిత్రం గురించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. సోష‌ల్ మీడియాను సైయారా (Saiyaara) సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ద‌ర్శకులు, నిర్మాత‌లు, సినీ టెక్నిషియ‌న్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Saiyaara Movie Success

ప్ర‌త్యేకించి డైన‌మిక్ డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి ఈ సినిమా స‌క్సెస్ పూర్తిగా ద‌ర్శ‌కుడు మోహిత్ సూరీకే ద‌క్కుతుంద‌న్నాడు. ఇదే స‌మ‌యంలో ప్ర‌ముఖ బాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు సుభాష్ ఘాయ్ సైయారా స‌క్సెస్ వెనుక క‌థే కీల‌క‌మ‌న్నారు. ఈ చిత్రం నుంచి అద్భుత‌మైన ఫోటోను పంచుకున్నారు. ఎక్స్ వేదిక‌గా షేర్ చేశారు. స్టార్లపై ఎక్కువ ఖర్చు చేయకండి, కథపై దృష్టి పెట్టండి అని సైయారా విజయం స్పష్టమైన సందేశాన్ని పంపుతుందోన్నారు.

కథనం, కొత్త తారాగణాన్ని ప్రశంసిస్తూ చిత్ర నిర్మాత సుభాష్ ఘాయ్, స్టార్ పవర్‌తో నడిచే అధిక బడ్జెట్ చిత్రాలకు వ్యతిరేకంగా సైయారా విజయాన్ని ఒక పాఠంగా హైలైట్ చేశారు. ఆదిత్య చోప్రా, మోహిత్ సూరిలను ప్రశంసించారు, ఇది హిందీ వాణిజ్య సినిమాకు ఒక మైలురాయిగా స్టార్ పవర్ ,భారీ బడ్జెట్‌లతో నడిచే పరిశ్రమకు ఒక పాఠంగా అభివర్ణించారు. అంతే కాదు ఇందులో న‌టించిన అహాన్ పాండే, అనీత్ ప‌ద్దాల గురించి ఎంత చెప్పినా తక్కువేన‌ని అన్నారు ఘాయ్.

Also Read : Hero Mahesh Babu – Murali Mohan : జ‌య‌భేరి ఆర్ట్స్ చిత్రాల‌లో అత‌డు టాప్

Exit mobile version