మల్హాన్ పూర్ : ఐపీఎల్ హిస్టరీలో అరుదైన ఘనత సాధించారు బెస్ట్ జోడీగా పేరు పొందిన ఓపెపర్లు సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్ మన్ గిల్ జోడి. ఈ ఇద్దరూ ఐపీఎల్ టోర్నీలో మరో రికార్డ్ నమోదు చేశారు. ఈ ఇద్దరి జంట పరుగుల వరద పారించింది. ప్రత్యేకించి భారీ స్కోర్ ను నమోదుతో ఆ జట్టు ఐపీఎల్ ఫైనల్ కు చేరుకుంది. ఇక టి20 ఫార్మాట్ లో శతక భాగస్వామ్యాల విషయంలో క్రిస్ గేల్ విరాట్ కోహ్లీల జోడి నెలకొల్పిన పరుగులను సాయి, గిల్ లు బ్రేక్ చేశారు. ఇక ఎలిమినేటర్ -2 మ్యాచ్ లో బాగంగా మల్హాన్ పూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసింది రాజస్తాన్. నిర్ణీత 20 ఓవర్లలో 214 రన్స్ చేసింది. అలవోకగా పూర్తి చేసింది లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్.
ఇక సాయి సుదర్శన్, శుభ్ మన్ గిల్ లు కలిసి కేవలం 12.5 ఓవర్లలోనే 167 పరుగులు జోడించారు, అయితే దురదృష్టవశాత్తు ‘హిట్-వికెట్’ రూపంలో సుదర్శన్ ఇన్నింగ్స్ ముగిసింది. టి20 క్రికెట్‌లో అత్యధిక శతక భాగస్వామ్యాలను నమోదు చేసిన క్రిస్ గేల్ , విరాట్ కోహ్లీ జోడీని వీరు అధిగమించారు. ఇక సాయి, గిల్ లు 48 ఇన్నింగ్స్‌లలో నమోదు చేసిన 11వ శతక భాగస్వామ్యం ఇది. తద్వారా 63 ఇన్నింగ్స్‌లలో 10 శతక భాగస్వామ్యాలు నమోదు చేసిన గేల్ , విరాట్ జోడీ రికార్డును వీరు అధిగమించారు. అంతే కాదు 2011 ఫైనల్‌లో RCBపై మైఖేల్ హస్సీ , మురళీ విజయ్ నమోదు చేసిన 159 పరుగుల భాగస్వామ్య రికార్డును వీరు అధిగమించారు.
