సాయి దుర్గా తేజ్ ‘సంబ‌రాల ఏటి గ‌ట్టు’ షూటింగ్ పూర్తి

యాక్ష‌న్ ఓరియంటెడ్ మూవీగా తీర్చిదిద్దిన ద‌ర్శ‌కుడు

hellotelugu-SYG

హైద‌రాబాద్ : సాయి దుర్గా తేజ్ సంచ‌ల‌నంగా మారాడు. త‌ను కీ రోల్ పోషిస్తున్న చిత్రం సంబురాల ఏటి గ‌ట్టు. ఈ మూవీకి సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. సాయి దుర్గా తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటి గట్టు’ షూటింగ్ పూర్తయింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఈ చిత్రం 2027 జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రోహిత్ కె.పి. దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ 160 రోజులకు పైగా సుదీర్ఘ షెడ్యూల్‌తో, పదికి పైగా యూనిట్ల పనితీరుతో విజయవంతంగా ముగిసింది. జనవరి నెలలో విడుదల కానున్న ఈ చిత్రం 2027 సంక్రాంతికి అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి , చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు సంబరాల ఏటి గట్టు’ చిత్రాన్ని.

వారి కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా చెబుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఒక ప్రత్యేక ‘బిహైండ్ ద సీన్స్’ (తెర వెనుక దృశ్యాలు) వీడియోను విడుదల చేసింది. ఇందులో సినిమాలోని భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు, కఠినమైన షూటింగ్ సమయంలో నటీనటులు, సాంకేతిక నిపుణుల మధ్య ఉన్న అనుబంధం కనిపిస్తుంది. షూటింగ్ పూర్తయిన ఆనందంలో చిత్ర బృందం సంబరాలు చేసుకున్న దృశ్యాలు కూడా ఇందులో ఉన్నాయి; సెట్స్‌లో అందరూ నీళ్లు చల్లుకుంటూ, ఆలింగనాలు చేసుకుంటూ ఎంతో ఉత్సాహంగా గడిపారు. షూటింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు చిత్ర బృందం సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి అవసరమైన తదుపరి పనులపై దృష్టి సారించనుంది. సంక్రాంతి పండుగ సీజన్‌లో విడుదల కానున్న సాయి దుర్గా తేజ్ ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Exit mobile version