Sai Dharam Tej : హైదరాబాద్ : హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిల్లలు, పేరెంట్స్ కు మధ్య ఉన్న బంధం గురించి స్పందించారు. పిల్లలకు తమ తల్లిదండ్రులతో బహిరంగంగా ప్రతిదీ పంచుకునే స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌లో అభయం మాసూమ్ సమ్మిట్ 2025 కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లల లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా అవగాహన పెంచాలని సూచించారు. దీనిని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ లో భాగమైన యంగ్ ఇండియన్స్ నిర్వహించడం అభినంద నీయమన్నారు, ప్రపంచ వ్యాప్తంగా 70 నగరాల్లోని యువ నిపుణులు పాల్గొన్నారు. ఈ సమ్మిట్ భారత్ రైజింగ్, యంగ్ ఇండియన్స్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీల సంయుక్త చొరవతో జరిగింది. డిజిటల్ ప్రపంచంలో ప్రతి బిడ్డ ముఖ్యమైన విషయంపై సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ మాట్లాడారు: పిల్లలను ఆన్‌లైన్, ఆఫ్ లైన్ లో సురక్షితంగా ఉంచే సమిష్టి బాధ్యత తీసుకోవాలన్నారు.
Sai Dharam Tej Key Comments
ఈ కార్యక్రమంలో అతిథులుగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్, మంత్రి సీతక్క, యంగ్ ఇండియన్స్ కో-చైర్మన్ భవిన్ పాండ్యా, నేషనల్ చైర్మన్ తరంగ్ ఖురానా, సీఐఐ తెలంగాణ చైర్మన్ శివ ప్రసాద్ రెడ్డి ,జ్యోత్స్న సింగ్ తదితరులు పాల్గొన్నారు. మన పిల్లలను మనమే కాపాడు కోవాలన్నారు. నేడు సోషల్ మీడియాలో పిల్లలు దుర్వినియోగం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా వారిని లైక్ చేసి నవ్వుతున్నారని పేర్కొన్నారు. ఇది తనను తీవ్రంగా బాధ పెడుతోందన్నారు. మనం నిర్మించాలనుకుంటున్న సమాజం ఇదేనా? పిల్లల గురించి ఎవరైనా ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు ఎలా చేయగలరు అని ప్రశ్నించారు.
Also Read : PM Modi – Clear Instructions : భారత్ లో తయారైన వస్తువులనే కొనండి- పీఎం మోదీ
