రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సెన్సేష‌న్

42 బంతులు 9 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 75

hellotelugu-ViratKohli

అహ్మ‌దాబాద్ : ఐపీఎల్ 19వ సీజన్ ఛాంపియ‌న్ గా నిలిచింది రెండోసారి ర‌జ‌త్ పాటిదార్ నాయ‌క‌త్వంలోని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు. ముందుగా బ్యాటింగ్ కు దిగింది గుజ‌రాత్ టైటాన్స్. ప్ర‌త్య‌ర్థి బెంగ‌ళూరు బౌల‌ర్లు చుక్క‌లు చూపించారు. ఒక్క వాషింగ్ట‌న్ సుంద‌ర్ త‌ప్ప ఏ ఒక్క ఆట‌గాడు ఆశించిన మేర రాణించ‌లేదు. స‌లామ్ ధ‌ర్ 2 వికెట్లు తీస్తే టాప్ ఆర్డ‌ర్ కు చుక్క‌లు చూపించాడు మ‌రో స్టార్ పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్. త‌ను 2 వికెట్లు తీశాడు. త‌న‌కు తోడుగా హేజిల్ వుడ్ సూప‌ర్ బౌలింగ్ తో ఆక‌ట్టుకున్నాడు. త‌ను కూడా మ‌రో 2 వికెట్లు తీసి గుజ‌రాత్ టైటాన్స్ ప‌త‌నాన్ని శాసించాడు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆ జ‌ట్టు 8 వికెట్లు కోల్పోయి 155 ప‌రుగుల‌కే ప‌రిమ‌తైంది.

అనంత‌రం మైదానంలోకి దిగింది రాయ‌ల్స్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు. వ‌చ్చీ రావ‌డంతోనే స్టార్ ప్లేయ‌ర్ కోహ్లీ త‌న‌దైన శైలిలో ఆడ‌టం మొద‌లు పెట్టాడు. ఇక స్వ‌ల్ప ఛేద‌న‌లో కోహ్లీ 42 బంతులు ఆడి 9 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. 75 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. వెంక‌టేశ్ అయ్య‌ర్ 16 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 32 ర‌న్స్ చేశాడు. కోహ్లీకి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ ద‌క్కింది. ఇక గుజ‌రాత్ టైటాన్స్ లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఒక్క‌డే చివ‌రి దాకా నిల‌బ‌డ‌టంతో ఆ మాత్రం స్కోర్ సాధ్య‌మైంది. లేక పోతే గుజ‌రాత్ టైటాన్స్ 100 ప‌రుగుల‌కే ప‌రిమితం అయ్యేది.

Exit mobile version