Rukmini Vasanth : బెంగళూరు : ప్రముఖ నటి, కాంతారా -2 ఫేమ్ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) సంచలనంగా మారారు. తన పేరును ఉపయోగించి నకిలీ మెస్సేజెస్ పంపిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా నటి అలర్ట్ అయ్యారు. తన ఫ్యాన్స్ ను సుతిమెత్తగా హెచ్చరించింది. నకిలీ సందేశాలు వస్తే తాను ఊరుకోనని, సీరియస్ గా తీసుకుంటానని స్పష్టం చేసింది రుక్మిణి వసంత్. ఈ సందర్బంగా రియల్ అభిమానులు జాగ్రత్తగా ఉండాలని, తన బృందంతో నేరుగా ధ్రువీకరించాలని స్పష్టం చేసింది. తనకు వెంటనే తెలియ చేయాలని కోరింది రుక్మిణి వసంత్. ఒక గుర్తు తెలియని వ్యక్తి తన పేరును ఉపయోగించి ప్రజలను సంప్రదిస్తున్నట్లు తనకు తెలిసిందని ఆరోపించారు.
Rukmini Vasanth Shocking
స్వయంగా రుక్మిణి వసంత్ తన పేరు చెప్పి సంప్రదిస్తున్నఆ అపరిచుతుడి మొబైల్ నెంబర్ ను కూడా షేర్ చేసింది. ఈ అంశం కలకలం రేపింది. ఇది తనకు చెందినది కాదని స్పష్టం చేసింది. ఈ ఫోన్ నెంబర్ నాది కాదు. దాని నుండి ఒకవేళ ఏమైనా సందేశాలు లేదా కాల్స్ వస్తే అవి పూర్తిగా నకిలీవని గుర్తించాలని కోరింది రుక్మిణి వసంత్. ఇలాంటి చెత్త సందేశాలకు, కాల్స్ కు ఎవరూ స్పందించ వద్దని కోరంది నటి. ఇది పూర్తిగా సైబర్ క్రైమ్ పరిధిలోకి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఇలా తప్పుదారి పట్టించినా లేదా మోసానికి పాల్పడినా తాను ఊరుకునేది లేదని పేర్కొన్నారు. ఈ మొబైల్ నెంబర్ గురించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రుక్మిణి వసంత్.
Also Read : K Kavitha Fired on Telangana Govt : ఎంజీఎం ఆస్పత్రి పట్ల నిర్లక్ష్యం తగదు
