K Kavitha : వరంగల్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (K Kavitha) నిప్పులు చెరిగారు. రాష్ట్ర సర్కార్ చోద్యం చూస్తోందని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. శనివారం వరంగల్ జిల్లా లో తెలంగాణ జాగృతి బాట కార్యక్రమంలో భాగంగా కవిత ఎంజీఎం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రోగులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కనీస వసతి సౌకర్యాలు లేక పోవడం దారుణమన్నారు. వరంగల్‌లో ఇద్దరు మంత్రులు ఉన్నా ఎంజీఎం ఆసుపత్రి పరిస్థితి పట్ల ఎవరికి పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. వాటాలు పంచు కోవడంలో ఉన్నంత శ్రద్ద ప్రజల సమస్యల పరిష్కారం లేకుండా పోయిందన్నారు.
K Kavitha Slams Congress Govt
దూది ఉంటే సూది ఉండదు, సూది ఉంటే దూది ఉండదు అన్నట్టుగా పరిస్థితి మారిందన్నారు కల్వకుంట్ల కవిత. ప్రభుత్వానికి కనీవిప్పు కలగాలని తాము మా వంతు సహాయం అందిస్తున్నాం అన్నారు. వరంగల్ ప్రాంతంలో వరదలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారంటూ వాపోయారు. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి అయినా, ప్రభుత్వ యంత్రాంగమైనా సహాయం చేయక పోవడం చాలా బాధాకరం అనిపేర్కొన్నారు కల్వకుంట్ల కవిత. ప్రజల కష్టాలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, సీఎంను డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.
Also Read : DY CM Pawan Kalyan Shocking : ఎర్ర చందనం గోడౌన్ ఆకస్మిక తనిఖీ
