ఆర్టీసీ స‌మ్మె ఎఫెక్ట్ అద‌నంగా 56 మెట్రో రైళ్లు

న‌డ‌ప‌నున్న‌ట్లు వెల్ల‌డించిన మెట్రో మేనేజ్మెంట్

hellotelugu-MetroTrains

హైద‌రాబాద్ : తమ న్యాయ ప‌ర‌మైన డిమాండ్లు ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల‌లో బ‌స్సులు నిలిచి పోయాయి. దీంతో ప్రయాణీకుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఉండేందుకు గాను మెట్రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు అద‌నంగా 56 మెట్రో రైళ్ల‌ను న‌డుపుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపింది. రద్దీ సమయాల్లోనూ, రద్దీ లేని సమయాల్లోనూ కలిపి పెద్ద ఎత్తున రైళ్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొంది. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ మెట్రో రైళ్ల రాకపోకల ను అద‌నంగా పెంచిన‌ట్లు తెలిపింది మెట్రో.

సాధారణ పని దినాల్లో, ఉదయం 8 నుండి 10:30 గంటల వరకు , సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు ఉండే రద్దీ సమయాల్లో రైళ్లను నడుపుతారు. ఈ సమయంలో వరుసగా వచ్చే రెండు రైళ్ల మధ్య 3 నిమిషాల 40 సెకన్ల వ్యవధి ఉంటుంది. రద్దీ లేని సమయాల్లో రైళ్ల సంఖ్యను తగ్గించి నడుపుతారు. ఈ సమయంలో మియాపూర్-LB నగర్ (C1) మార్గంలో 4 నిమిషాల 50 సెకన్ల వ్యవధితోనూ, నాగోల్-రాయదుర్గం (C3) మార్గంలో 5 నిమిషాల 20 సెకన్ల వ్యవధితోనూ మొత్తం 44 రైళ్లను వినియోగిస్తారు. దీని ప్రకారం మియాపూర్-LB నగర్ మార్గంలో 4 నిమిషాల 20 సెకన్ల వ్యవధితోనూ, నాగోల్-రాయదుర్గం మార్గంలో 3 నిమిషాల 40 సెకన్ల వ్యవధితోనూ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. రాత్రి 11 గంటల తర్వాత కూడా చివరి మెట్రో రైలు సేవలను పొడిగించే అవకాశాన్ని మెట్రో వెల్ల‌డించింది.

Exit mobile version