ఆర్టీసీకి యూపీఐ ద్వారా రూ. 505.95 కోట్ల ఆదాయం

డిజిట‌ల్ సేవ‌లు వాడుకుంటున్న ప్ర‌యాణీకులు

hellotelugu-TSRTCUPIPayments

హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా డిజిట‌ల్ చెల్లింపులు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇదే క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రు క్యాష్ వాడ‌కం త‌గ్గిస్తూ వ‌స్తున్నారు. తాజాగా తెలంగాణ‌లోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సంస్థ ద్వారా వేలాది మంది ప్ర‌తిరోజూ వివివిధ గ‌మ్య స్తానాల‌కు వెళుతుంటారు. దీనిని గ‌మ‌నించిన చిల్ల‌ర స‌మ‌స్య కొన‌సాగుతోంది. ఈ మేర‌కు ఆర్టీసీ సంస్థ ప్ర‌యాణీకుల‌కు డిజిట‌ల్ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకుంది. ప్ర‌తి రోజూ దీని ద్వారా ఏకంగా రూ. 2.50 కోట్లు వ‌స్తోంద‌ని వెల్ల‌డించారు ఆర్టీసీ సంస్థ వైస్ చైర్మ‌న్, మేనేజింగ్ డైరెక్ట‌ర్ వై. నాగిరెడ్డి.

సంస్థ కేవలం 11 నెలల్లో యుపీఐ లావాదేవీల ద్వారా రూ. 505.95 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంతో పాటు పారదర్శకత, వేగవంతమైన సేవలు , ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. బస్సుల్లో ప్రయాణించే వారికి డిజిటల్ టికెట్ చెల్లింపులను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. లక్షలాది మంది ప్రయాణికులు యూపీఐ ఆధారిత చెల్లింపులను ఎంచుకోవడం వల్ల భారీ స్థాయిలో డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. రోజువారీ యూపీఐ వసూళ్లు సుమారు రూ. 2,000 నుండి దాదాపు రూ. 2.5 కోట్లకు గణనీయంగా పెరిగాయని, ఇది ప్రయాణికులలో నగదు రహిత చెల్లింపుల పట్ల పెరుగుతున్న ఆదరణను సూచిస్తుందని అన్నారు ఎండీ.

అయితే ఇప్పుడు ప్రజా రవాణాలో డిజిటల్ చెల్లింపుల విషయంలో ఆర్టీసీ ఒక ఆదర్శంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో 100 శాతం నగదు రహిత ప్రయాణాన్ని సాధించే దిశగా సంస్థ కృషి చేస్తోందని తెలిపారు.

Exit mobile version