Rohit Sharma : ముంబై : సంజూ శాంసన్ గురించి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు తనపై నమోదైన అత్యధిక 350 సిక్సర్ల రికార్డ్ ను బ్రేక్ చేసే సత్తా ఇండియా క్రికెట్ లో కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ కు మాత్రమే ఉందన్నాడు. తను ఈ మధ్యన అద్బుమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నాడని కొనియాడాడు. ప్రధానంగా ఓపెనర్ గా తను కరెక్ట్ గా సరి పోతాడన్నాడని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా కేరళ క్రికెట్ లీగ్ (కేసీఎల్)లో శాంసన్ 36 సిక్సర్లు కొట్టాడు. ముంబైలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాన్ని దర్శించుకున్నాడు రోహిత్ శర్మ. ఆయన పూజలు చేశారు. పూజారులు ఆశీర్వాదం అందజేశారు. స్వామి వారి ప్రసాదాన్ని ఇచ్చారు.
Rohit Sharma Shocking Comments on Samson
అనంతరం మీడియాతో మాట్లాడారు రోహిత్ శర్మ. తన అభిప్రాయాలను పంచుకున్నాడు. భారత జట్టులో సత్తా కలిగిన యువ ఆటగాళ్లు ఎందరో ఉన్నారని పేర్కొన్నాడు. ఇప్పటికిప్పుడు ఇండియా తరపున మూడు కీలకమైన టీమ్ లు తయారవుతాయని తెలిపాడు. గతంలో జట్టు పరంగా చోటు దక్కించు కోవాలంటే అంతగా ఇబ్బంది పడాల్సి ఉండేది కాదన్నాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నాడు. ప్రతి మ్యాచ్ జట్టులో ఎంపికైన ఆటగాడికి కత్తి మీద సాము లాగా మారిందని చెప్పాడు. ఎందుకంటే తను ఆడక పోతే ఆ ప్లేస్ లో మరికొందరు ఆటగాళ్లు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నాడు. ఈ సమయంలో శాంసన్ చాలా కనిస్టెంట్ గా వరుసగా సూపర్ స్కోర్స్ చేస్తూ అలరిస్తున్నాడని, తను సిక్స్ లు కొట్టడంలో నేర్పరి అని కితాబు ఇచ్చాడు.
Also Read : Pavagadh Hill Shocking Incident : గుజరాత్ పావగఢ్ హిల్స్ రోప్ వే తెగిపడి 6 మృత్తి
