గౌతమ్ గంభీర్ సీఈఓ కాదు క‌న్స‌ల్టెంట్ మాత్ర‌మే

నిప్పులు చెరిగిన క్రికెట్ కామెంటేట‌ర్ హ‌ర్ష బోగ్లే

hellotelugu-HarshaBhogle

హైద‌రాబాద్ : భార‌త క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్ గా ఉన్న గౌత‌మ్ గంభీర్ పై తీవ్ర స్థాయిలో మండి ప‌డుతున్నారు మాజీ క్రికెట‌ర్లు, అన‌లిస్టులు, క్రికెట్ కామెంటేట‌ర్లు. ప్ర‌ధానంగా త‌ను బాధ్య‌త‌లు చేప‌ట్టాక టాలెంట్ క‌లిగిన వారిని కాకుండా త‌న‌కు ఇష్టం వ‌చ్చిన ప్లేయ‌ర్ల‌కు ప్ర‌యారిటీ ఇవ్వ‌డం, జ‌ట్టులోకి తీసుకోవ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. సోష‌ల్ మీడియాలో నిత్యం ట్రోల్స్ కు గుర‌వుతున్నాడు గంభీర్. అయినా ఎవ‌రినీ ప‌ట్టించుకోవ‌డం లేదు. మోనార్క్ గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం ప‌ట్ల తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు అత్యంత సౌమ్యుడిగా పేరు పొందిన వ‌ర‌ల్డ్ వైడ్ గా టాప్ కామెంటేట‌ర్ గా గుర్తింపు పొందిన హైద‌రాబాద్ కు చెందిన హ‌ర్ష బోగ్లే.

ఆయ‌న ఓ ఛాన‌ల్ లో జ‌రిగిన చ‌ర్చ‌లో పాల్గొన్నారు. ప్ర‌స్తుతం గంభీర్ అనుస‌రిస్తున్న విధానాల‌ను త‌ప్పు ప‌ట్టారు. తీసుకుంటున్న నిర్ణ‌యాలు జ‌ట్టుకు ప్ర‌యోజ‌నం చేకూరేలా లేవంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు . ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నాడు. 31 టి20 ఇన్నింగ్స్ లు ఆడిన శుభ్ మ‌న్ గిల్ కేవ‌లం 285 ర‌న్స్ మాత్ర‌మే చేశాడ‌ని, కానీ కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ 190కి పైగా స్ట్రైక్ రేట్ క‌లిగి ఉన్నా ఎందుకు ఎంపిక చేయ‌డం లేద‌ని సూటిగా ప్ర‌శ్నించారు గౌతమ్ గంభీర్ ను ఉద్దేశించింది. ఇలాంటి చెత్త నిర్ణ‌యాల కార‌ణంగా జ‌ట్టు స‌మ‌తుల్య‌త దెబ్బ తింటుంద‌న్నారు. త‌ను జ‌ట్టుకు సీఈఓ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని, కేవ‌లం క‌న్స‌ల్టెంట్ మాత్ర‌మేన‌ని ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు హ‌ర్ష బోగ్లే.

Exit mobile version