ర‌వి బిష్ణోయ్ ని ప‌ట్టించుకోని రిష‌బ్ పంత్

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఇర్ఫాన్ ప‌ఠాన్

hellotelugu-IrphanPathan

ముంబై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టు గురించి ప్ర‌స్తావించాడు. ప్ర‌త్యేకించి జ‌ట్టు స్కిప్ప‌ర్ గా ఉన్న రిష‌బ్ పంత్ తీసుకున్న నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టాడు. త‌ను వేలం పాట‌లో దేశీయ ప్లేయ‌ర్లపై న‌మ్మ‌కం పెట్ట‌క పోవ‌డం ప‌ట్ల అభ్యంత‌రం వ్య‌క్తం చేశాడు. ఇండియాలో వ‌చ్చే ఏడాదిలో జ‌రిగే ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) లో పాల్గొనే జ‌ట్ల‌లో ప్ర‌త్యేకించి ల‌క్నో జ‌ట్టు గురించి రివ్యూ చేశాడు. త‌ను జియో స్టార్ ఛాన‌ల్ తో ముచ్చటించాడు. టీమ్ కు సంబంధించి ఇంకా ఐదుగురు బ్యాట‌ర్లు కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. బౌలింగ్ ప‌రంగా కాస్తంతా మెరుగుద‌ల క‌నిపించినా లోయ‌ర్ ఆర్డ‌ర్ బ్యాటింగ్ ఇప్ప‌టికీ ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని చెప్పాడు ఇర్ఫాన్ ప‌ఠాన్.

ప్ర‌ధానంగా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ విదేశీ ఆట‌గాళ్ల‌పై ఆధార‌ప‌డ‌టాన్ని త‌గ్గించు కోవాల‌ని సూచించాడు. ఫాస్ట్ బౌలింగ్ ఎంపిక‌పై దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశాడు. అన్రిచ్ నోర్ట్రే , హ‌స‌రంగా జ‌ట్టుకు బ‌లంగా మార‌నున్నార‌ని చెప్పాడు. ఇదే స‌మ‌యంలో మ‌రో స్టార్ బౌల‌ర్ ర‌వి బిష్ణోయ్ పై కెప్టెన్ రిష‌బ్ పంత్ ఎందుకు ఫోక‌స్ పెట్ట‌లేక పోయాడ‌ని ప్ర‌శ్నించారు. రూ . కోట్ల‌కు ల‌క్నో యాజ‌మాన్యం శ్రీ‌లంక ప్లేయ‌ర్ ను తీసుకుంది. ఇదే క్ర‌మంలో ఆయుష్ బ‌దోని, అబ్దుల్ స‌మ‌ద్ వంటి మ‌రో అగ్ర‌శ్రేణి బ్యాట‌ర్ ఉండి ఉంటే బాగుండేద‌న్నాడు ఇర్ఫాన్ పఠాన్. తాజాగా మాజీ క్రికెట‌ర్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి ల‌క్నో జ‌ట్టులో.

 

Exit mobile version