Walking Benefits : ఆరోగ్యకరమైన జీవనశైలికి వాకింగ్ (నడక) ఒక సరళమైన, కానీ ప్రభావవంతమైన మార్గమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజువారీ నడక (Walking Benefits) అనేక రుగ్మతలను నివారించడంలో తోడ్పడుతుందని, శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని యోగా నిపుణులు సూచిస్తున్నారు.
Walking Benefits – వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు:
కేలరీలు బర్న్ అవుతాయి: నడక ద్వారా శరీరంలోని కేలరీలు ఖర్చవుతాయి. ఇది బరువు తగ్గాలనుకునే వారికి సహాయకారి.
గుండె ఆరోగ్యం మెరుగవుతుంది: వాకింగ్ వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండటంతో గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది.
మానసిక ప్రశాంతత: రోజూ నడక ద్వారా ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. డిప్రెషన్ తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
శక్తి వృద్ధి: కండరాలు బలోపేతం కావడంతో పాటు, ఎముకల ఆరోగ్యం మెరుగవుతుంది. శరీర దృఢత్వం పెరుగుతుంది.
ఫిట్‌నెస్: వ్యాయామంగా వాకింగ్ తీసుకుంటే దినచర్యలో చురుకుతనం, ఉత్సాహం పెరుగుతాయి.
వాకింగ్‌లో పాటించాల్సిన జాగ్రత్తలు:
పార్కులో నడవడం ఉత్తమం: ప్రకృతి మధ్య నడక మానసికంగా శాంతిని కలిగిస్తుంది.
హైడ్రేషన్ అవసరం: వాకింగ్‌కు ముందు, తర్వాత తగినన్ని ద్రవాలు తీసుకోవాలి.
సౌకర్యవంతమైన షూస్ ధరించండి: మంచి బూట్ల వినియోగం వల్ల పాదాలను గాయాల నుంచి కాపాడుకోవచ్చు.
ఇతర వ్యాయామాల సహకారం: వాకింగ్‌కు తోడు ఇతర వ్యాయామాలను కూడా చేర్చడం శ్రేయస్కరం.
మొత్తానికి, రోజూ 30 నిమిషాల పాటు నడవడం ద్వారా శరీరానికి, మనసుకు సమతుల్య ఆరోగ్యం లభించవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : Asias Oldest Elephant Death : ఆసియా లోనే అతి వృద్ద ఏనుగు కన్నుమూత



















