KTR : హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రగతి నివేదికను విడుదల చేశారు. ఈ సందర్బంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ లో ఓడి పోతామని తెలిసి పోయిందని, దీంతో తట్టుకోలేక ఏదేదో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు విజ్ఞులు అని వారు అన్నీ గమనిస్తుంటారని అన్నారు. చేసిన మోసం ఇప్పటికే గ్రహించారని, ఇక ఓటుతో కాంగ్రెస్ కు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చేందుకు సిద్దమై ఉన్నారని చెప్పారు కేటీఆర్. రోజు రోజుకు తాను సీఎం అన్న సోయి లేకుండానే మాట్లాడుతున్నాడని మండిపడ్డారు రేవంత్ రెడ్డిపై.
KTR Challenges CM Revanth Reddy
రేవంత్ రెడ్డికి ఆయన భాషలో ఆయనకు అర్థమైయేటట్లు చెప్పే సత్తా మాకు కూడా ఉందన్నారు. కానీ సీఎం ప్రతి రోజూ మమ్మల్ని తిట్టినా మేం మాత్రం గౌరవంగానే మాట్లాడుతామన్నారు. మాకు సంస్కారం ఉందన్నారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ఏం చేసిందో రెండేళ్లలో రేవంత్ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు కేటీఆర్ సీఎంకు. చెత్త ఎవరిదో సత్తా ఎవరిదో తేల్చుకుందాం రావాలన్నారు. రేవంత్ రెడ్డి నిజయితీపరుడైతే చర్చకు సిద్దం కావాలని అన్నారు కేటీఆర్. డేట్, టైమ్, ప్లేస్ రేవంత్ రెడ్డే ఫిక్స్ చేయాలని స్పష్టం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటరా, గాంధీ భవనా.. అసెంబ్లీనా, ఎక్కడైనా చర్చకు రెడీగా ఉన్నామని ప్రకటించారు.
Also Read : DY CM Bhatti Vikramarka Clear Update : 53 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్
