MLC Kavitha Fired on CM : రేవంత్ రెడ్డి ఫ్లైట్ మోడ్ సీఎం

ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

Hello Telugu - MLC Kavitha Fired on CM

Hello Telugu - MLC Kavitha Fired on CM

MLC Kavitha : హైద‌రాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కవిత తీవ్ర విమర్శలు చేశారు. త‌న‌ను ఫ్లైట్ మోడ్ సీఎం అంటూ ఎద్దేవా చేశారు. త‌ను కొలువు తీరిన నాటి నుంచి నేటి దాకా ఎక్క‌డం దిగ‌డం మాత్ర‌మే చేస్తున్నార‌ని, ప్ర‌జ‌ల గురించి ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌న్నారు. క‌విత (MLC Kavitha) మీడియాతో మాట్లాడారు. దేశ రాజధానికి వెళ్లడంలో రెవంత్ రెడ్డి ఇప్పటికే అర్ధ సెంచరీ సాధించారని ఇది ఓ రికార్డ్ అని పేర్కొన్నారు. ఇప్ప‌టికే అన్ని వ్య‌వ‌స్థ‌లు నీరుగారి పోయాయ‌ని వాపోయారు. ఇచ్చిన ఆరు హామీలు ఏమ‌య్యాయంటూ ప్ర‌శ్నించారు.

MLC Kavitha Slams CM Revanth Reddy

బీసీల‌పై చిత్త‌శుద్ది ఉంటే ఆర్డినెన్స్ తీసుకు రావాల‌ని డిమాండ్ చేశారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. తాము ప్ర‌జ‌ల త‌రపున ప్ర‌శ్నిస్తూనే ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. కొంద‌రు చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నార‌ని, వారి మాట‌ల‌ను, విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించు కోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. త‌మ దృష్టి అంతా కేవ‌లం స‌మ‌స్య‌ల ప‌రిష్కారం పైనే ఉంటుంద‌న్నారు. ఆ దిశ‌గా తాము అడుగులు వేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. జాగృతి సంస్థ ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి జిల్లాలో పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మాలకు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రు త‌మ త‌మ ప్రాంతాల‌లో మ‌రింత బ‌లోపేతం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌.

ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను హామీల పేరుతో మోసం చేస్తోంద‌ని ఆరోపించారు. ఇచ్చిన వాటిలో ఒక్క‌టి కూడా అమ‌లు కాలేద‌న్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆవేద‌న చెందారు ఎమ్మెల్సీ.

Also Read : AP Govt Proven : ఆడబిడ్డ నిధి పై ఆంధ్రప్రదేశ్ సర్కార్ కుష్ కబుర్

Exit mobile version