ఢిల్లీ : ఏఐసీసీ కీలక ప్రకటన చేసింది. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డితో పాటు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ కు చోటు దక్కడం విశేషం. పార్టీ తరపున మొత్తం 40 మంది స్టార్ ప్రచారకర్తలను ఎంపిక చేసింది. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో వచ్చే జనవరి 15 నుంచి ముంబైతో పాటు ఇతర 28 నగరాలలో జరగనున్నాయి. రేవంత్, అజ్జూతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ , పార్టీ సీనియర్ నేతలు కన్హయ్య కుమార్, జిగ్నేష్ మేవానీ ప్రముఖ ప్రచారకర్తలుగా ఉన్నారు.
ఇదిలా ఉండగా ఏఐసీసీ కీలక సూచనల మేరకు మంగళవారం మహారాష్ట్ర కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. మహారాష్ట్రకు చెందిన పార్టీ నాయకులు కూడా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు. ఫలితాలు మరుసటి రోజు ప్రకటించబడతాయి. 2,869 స్థానాలకు 3.48 కోట్లకు పైగా ఓటర్లు పాల్గొనే ఈ ఎన్నికలు, అధికారంలో ఉన్న బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన , అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపిలతో కూడిన మహా యుతికి, ప్రతిపక్ష ఎంవిఏ కూటమి అయిన ఉద్ధవ్ ఠాక్రే శివసేన (యుబిటి), కాంగ్రెస్, ఎన్‌సిపి (ఎస్‌పి) మధ్య కీలకమైన రాజకీయ పోరుకు వేదిక కానున్నాయి.

















