గుర‌జాడ అప్పారావు గృహం పున‌రుద్ద‌ర‌ణ‌

hellotelugu-GurjadaApparao

అమ‌రావ‌తి : ఏపీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి గ‌ర్వ కార‌ణ‌మైన అభ్యుద‌య క‌వి గుర‌జాడ అప్పారావు నివ‌సించిన గృహాన్ని పున‌రుద్దిరించాల‌ని ఆదేశించారు. ఆయ‌న పేరుతో నిర్మించే ఆడిటోరియం నిర్మాణానికి రూ. 1.20 కోట్లతో ప్రతిపాదనలు త‌యారు చేయాల‌న్నారు. గురజాడ రచనల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. విశాఖ సేనతో సేనాని సభలో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త, అభ్యుదయ కవితా పితామహుడిగా పేరుగాంచిన శ్రీ గురజాడ అప్పారావు జ్ఞాపకాలను భావితరాలకు అందిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. పురావస్తు శాఖ సహకారంతో 150 ఏళ్ల క్రితం ఆయన నివాసం ఉన్న ఇంటి పునరుద్ధరణ పనులు చేపట్టారు.

ఆ నివాసానికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో సాంస్కృతిక శాఖ సహకారంతో రూ. 1.20 కోట్లతో ఆడిటోరియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతోపాటు శ్రీ గురజాడ అప్పారావు రచనల డిజిటలైజేషన్ ప్రక్రియను కూడా పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. శ్రీ గురజాడ అప్పారావు నివాస గృహం శిథిలావస్థకు చేరిన విషయాన్ని వార్తా పత్రికల ద్వారా తెలుసుకుని, విశాఖపట్నంలో నిర్వహించిన సేనతో సేనాని సభలో ఆ ఇంటి పునరుద్ధరణతో పాటు ఆడిటోరియం నిర్మాణం, రచనల డిజిటలైజేషన్ కు హామీ ఇచ్చారు . విజయనగరం కోట జంక్షన్ సమీపంలోని ఈ నివాస గృహంలోనే శ్రీ గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ రచన చేశారు.

Exit mobile version